Breaking News

స్టెరాయిడ్స్‌ వల్లే నా ముఖం ఇలా మారిపోయింది: సమంత

Published on Wed, 09/20/2023 - 17:50

మయోసైటిస్‌ వల్ల ఎంతో బాధను అనుభవిస్తోంది హీరోయిన్‌ సమంత. ఆ బాధను పంటికింద భరిస్తూ తను ఒప్పుకున్న సినిమా షూటింగ్స్‌లో పాల్గొంది. ఓవైపు ఆ వ్యాధికి చికిత్స తీసుకుంటూనే మరోవైపు సినిమాలు చేస్తూ వాటి కోసం ఎక్సర్‌సైజ్‌లు చేస్తూ కష్టపడింది. ఇటీవల ఖుషి సినిమాతో పలకరించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం జాలీగా వెకేషన్‌ ఎంజాయ్‌ చేస్తోంది.

నా చర్మం దెబ్బతింది..
అయితే ఓసారి అభిమానులను పలకరిద్దాం అనుకుందో, ఏమో.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యాన్స్‌తో చిట్‌చాట్‌ పెట్టింది. నెక్స్ట్‌ ప్రాజెక్ట్‌ ఏంటన్న ప్రశ్నకు ప్రస్తుతం ఏదీ ఒకే చేయలేదని చెప్పింది. మీ చర్మం ఎందుకంత బాగుందన్న ప్రశ్నకు.. 'అలాంటిదేమీ లేదు, చికిత్సలో భాగంగా చాలా స్టెరాయిడ్స్‌ తీసుకున్నాను. దానివల్ల నా చర్మం దెబ్బతింది, పిగ్మంటేషన్‌ వచ్చింది. చిన్మయి నన్ను గ్లాసీగా చేస్తానంది' అని పేర్కొంది. యాక్షన్‌ సినిమా చేయొచ్చుగా అని ఓ అభిమాని అడగ్గా సిటాడెల్‌లో యాక్షన్‌ రోల్‌ చేశానంది.

ఆ మూడు అంశాలు..
నీ జీవితంతో ముడిపడి ఉన్న మూడు అంశాలు చెప్పమనగా.. '1.నేను దేన్నైనా సాధిస్తాను. 2. పరిస్థితులు ఇలా ఉన్నాయేంటని ప్రశ్నించడం మాని యథాతథంగా స్వీకరిస్తాను. 3. నీతి, నిజాయితీతో ముందుకు సాగుతా' అని రిప్లై ఇచ్చింది. టీనేజర్స్‌కు మీరిచ్చే సందేశం ఏంటి? అన్న ప్రశ్నకు 'నా జీవితం ఇ‍క్కడితోనే అయిపోయింది అని ఎప్పుడూ ఫీలవకండి. జీవితంలో ఇంకా ఎన్నో కష్టాలు, సమస్యలు వస్తూ ఉంటాయి. వాటిని ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగండి. నేను 25 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు నేను ఈ స్థాయిలో ఉంటానని అసలు ఊహించలేదు. లైఫ్‌లో ఇన్ని ఇబ్బందులు పడతాననీ అనుకోలేదు. పాజిటివ్‌గా ముందుకు వెళ్లండి' అని చెప్పుకొచ్చింది సామ్‌.

చదవండి: జయసుధ ఫోన్‌ లాక్కున్న మోహన్‌ బాబు.. వీడియో వైరల్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)