ఆ అనుబంధానికి పేరు పెట్టలేను!:సమంత

Published on Sat, 04/26/2025 - 03:43

‘‘జీవితంలో మనం తీసుకునే ఒక నిర్ణయాన్ని దృష్టిలో ఉంచుకొని కెరీర్‌ ఎలా ఉంటుందో చెప్పలేం. ఒకవేళ ఎవరైనా అలా నిర్ణయిస్తే అది అబద్ధమే అవుతుంది. తెలిసీ తెలియక తీసుకున్న ఎన్నో నిర్ణయాలు కెరీర్‌పై ప్రభావం చూపుతాయి’’ అని సమంత అన్నారు. తమిళ చిత్ర పరిశ్రమలో ఇటీవల నిర్వహించిన ‘గోల్డెన్‌ క్వీన్‌’ పురస్కారాల్లో’ గోల్డెన్‌ క్వీన్‌ అవార్డు అందుకున్నారు సమంత.

అనంతరం ఆమె తన కెరీర్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇంతమంది అభిమానులను సొంతం చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తాను. నా అదృష్టంతోపాటు నేను పడిన కష్టమే ఈరోజు ఇంతమంది అభిమానం సంపాదించుకోవడానికి కారణం అయింది. ఇది దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నాను’’ అని చె΄్పారు సమంత. ఇంకా తన వ్యక్తిగత జీవితం గురించి ఆమె మాట్లాడుతూ– ‘‘నా ఆరోగ్యం బాగాలేనప్పుడు రాహుల్‌ రవీంద్రన్‌ (నటుడు, దర్శకుడు) ఉదయం నుంచి సాయంత్రం వరకూ నాతోనే ఉంటూ జాగ్రత్తగా చూసుకున్నాడు.

మా అనుబంధానికి పేరు పెట్టలేను. ఫ్రెండా? సోదరుడా? కుటుంబ సభ్యుడా? రక్త సంబంధీకుడా? అనేది చెప్పలేను’’ అన్నారు. ఇక సమంత కెరీర్‌ విషయానికొస్తే... ప్రస్తుతం ‘రక్త్‌ బ్రహ్మాండ్‌: ది బ్లడీ కింగ్‌డమ్‌’ అనే వెబ్‌ సిరీస్‌ చేస్తున్నారు. అలాగే తన సొంత బ్యానర్‌ ట్రాలాలా మూవింగ్‌ పిక్చర్స్‌పై ఆమె నిర్మించిన తొలి చిత్రం ‘శుభం’ మే 9న రిలీజ్‌  కానుంది.

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)