Breaking News

అలాంటి తప్పులు భవిష్యత్తులో జరగనివ్వను: సమంత

Published on Mon, 04/14/2025 - 12:57

హీరోయిన్‌ సమంత (Samantha Ruth Prabhu) సినిమా వచ్చి రెండేళ్లవుతోంది. చివరగా 'ఖుషి' చిత్రంతో పలకరించిన ఈ బ్యూటీ ప్రస్తుతం మా ఇంటి బంగారం అనే మూవీ చేస్తోంది. అలాగే నెట్‌ఫ్లిక్స్‌లో రక్త్‌ బ్రహ్మాండ్‌ అనే ప్రాజెక్ట్‌లోనూ భాగమైంది. ఇవి కాకుండా శుభం అనే సినిమా నిర్మిస్తోంది. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌కు హాజరైన ఆమె నటీనటుల మధ్య పారితోషికం వ్యత్యాసంపై పెదవి విప్పింది.

రెమ్యునరేషన్‌ వ్యత్యాసాలు
సమంత మాట్లాడుతూ.. నేను చాలా సినిమాల్లో హీరోతో పాటు సమాన పనిదినాల్లో వర్క్‌ చేశాను. కానీ మాకిచ్చే రెమ్యునరేషన్‌ మాత్రం ఒకేలా ఉండేది కాదు. కొన్ని పెద్ద సినిమాల్లో హీరో పాత్ర కీలకంగా ఉంటుంది. పైగా తనే జనాల్ని థియేటర్‌కు రప్పించగలడు... అలాంటివాటిని నేను అర్థం చేసుకోగలను. అలాంటి సినిమాల్లో ఇద్దరి మధ్య బేధం చూపించినా నేను తప్పుపట్టను.

సమానత్వం కనిపించదు
కానీ కొన్ని చిత్రాల్లో హీరోహీరోయిన్‌కు ఇద్దరికీ సమాన ప్రాధాన్యత ఉంటుంది. పారితోషికం దగ్గర మాత్రం ఆ సమానత్వం కనిపించదు. అదెందుకో ఇప్పటికీ అర్థం కాదు. నా విషయానికి వస్తే.. నేను ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లవుతోంది. ఇన్నేళ్లలో నేను చేసిన తప్పుల్ని పునరావృతం కాకుండా చూసుకుంటాను. ఇప్పుడు సడన్‌గా అన్నీ మార్చలేనేమో కానీ భవిష్యత్తు గురించి మాత్రం ఏదో ఒకటి చేయగలను. అయినా నేను చేయకపోతే ఇంకెవరు చేస్తారు? ఎక్కడైతే నిందలు, బాధలు పడ్డామో అక్కడే పరిష్కారం వెతుక్కోవాలి. నేను ఈ సిద్ధాంతాన్నే నమ్ముతాను అని సమంత చెప్పుకొచ్చింది.

 

 

చదవండి: కారులో బాంబు పెట్టి లేపేస్తాం.. సల్మాన్‌కు వార్నింగ్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)