అమెరికాలో ప్రియుడితో చెట్టాపట్టాల్‌?!.. అతడితోనే విందు, విహారం..

Published on Wed, 07/09/2025 - 12:02

స్టార్‌ హీరోయిన్‌ సమంత (Samantha Ruth Prabhu) ఇటీవల తానా వేడుకల కోసం అమెరికా వెళ్లింది. మొదటి సినిమా నుంచి తెలుగు ప్రేక్షకులు తనను ఆదరిస్తూనే ఉన్నారంటూ భావోద్వేగానికి లోనైంది. తెలుగువారికి తన హృదయంలో ప్రత్యేక స్థానం ఉందని పేర్కొంది. ఈ వేడుకల అనంతరం సామ్‌ అమెరికాలో వెకేషన్‌ ఎంజాయ్‌ చేస్తున్నట్లు కనిపిస్తోంది.

రాజ్‌తో అమెరికాలో చెట్టాపట్టాల్‌
అమెరికాలోని డెట్రాయిట్‌లో తనకు నచ్చిన ఫుడ్‌ తింటూ అక్కడి అందాలను ఆస్వాదిస్తున్న ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. అందులో రెండు ఫోటోల్లో దర్శకుడు రాజ్‌ నిడిమోరు కూడా ఉండటం విశేషం! ఓ ఫోటో అయితే.. వీరిద్దరూ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నారు. రాజ్‌.. ఆప్యాయంగా సామ్‌ భుజంపై చేయి వేశాడు. అతడి సాన్నిహిత్యంలో ఉన్న సామ్‌ నవ్వులు చిందిస్తూ కనిపిస్తోంది. మరో ఫోటోలో రాజ్‌తో పాటు మరికొంతమంది ఫ్రెండ్స్‌తో లంచ్‌కు వెళ్లింది. ఇది చూసిన అభిమానులు.. సామ్‌.. రాజ్‌తో రిలేషన్‌ను అధికారికంగా ప్రకటించేసినట్లేనని అభిప్రాయపడుతున్నారు.

ఎలా మొదలైంది?
రాజ్‌ నిడిమోరు (Raj Nidimoru), తన స్నేహితుడు కృష్ణతో కలిసి ద ఫ్యామిలీ మ్యాన్‌ వెబ్‌ సిరీస్‌ డైరెక్ట్‌ చేశాడు. ఇందులో సమంత హీరోయిన్‌గా నటించింది. అప్పుడే వీరిమధ్య ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసినట్లు తెలుస్తోంది. తర్వాత వీరిద్దరూ సిటాడెల్‌: హనీ బన్నీ వెబ్‌ సిరీస్‌ చేశారు. సమంత చేతిలో ఉన్న రక్త బ్రహ్మాండ్‌: ద బ్లడీ కింగ్‌డమ్‌ ప్రాజెక్టుకు సైతం రాజ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు.

పర్సనల్‌ లైఫ్‌
అయితే రాజ్‌కు ఇదివరకే పెళ్లయింది. అతడికి భార్యతో పాటు ఓ కూతురు కూడా ఉంది. త్వరలోనే రాజ్‌.. ఆమెకు విడాకులివ్వనున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. సమంత విషయానికి వస్తే.. 2017లో నాగచైతన్యను పెళ్లి చేసుకుంది. కొంతకాలం పాటు వీరు బాగానే కలిసున్నారు. తర్వాతేమైందో ఏమోకానీ 2021లో విడాకులు తీసుకున్నారు. అనంతరం నాగచైతన్య.. తెలుగు హీరోయిన్‌ శోభిత ధూళిపాళను వివాహం చేసుకున్నాడు.

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)