Breaking News

ఎన్ని కోట్లు ఇచ్చినా ఇకపై వాటికి మాత్రం 'నో'!

Published on Tue, 03/19/2024 - 01:28

‘ఊ అంటావా మావ.. ’ అంటూ ‘పుష్ప’లోని ప్రత్యేక పాటలో వీలైనంత గ్లామరస్‌గా కనిపించడంతో పాటు హాట్‌ స్టెప్స్‌తో, హాట్‌ హాట్‌ హావభావాలతో ఐటమ్‌ సాంగ్‌ లవర్స్‌ని ఆకట్టుకున్నారు సమంత. అయితే ఈ బ్యూటీ ఈ రేంజ్‌లో చేయడం చాలామందిని షాక్‌కి గురి చేసింది. ‘అవసరమా?’ అని చర్చించుకున్నవాళ్లూ ఉన్నారు. సమంత కూడా ఈ పాట చేసినప్పుడు చాలా అసౌకర్యంగా ఫీలయ్యారట. ఆ విషయం గురించి ఇటీవల ఓ సందర్భంలో మాట్లాడుతూ – ‘‘ఊ అంటావా..’ పాట ఫస్ట్‌ షాట్‌ తీసేటప్పుడు భయంగా అనిపించింది. నా కాళ్లు వణికాయి.

నేను అంత అందంగా ఉండనని, కొందరు అమ్మాయిల్లా బాగుండననీ అనుకుంటుంటాను. దాంతో నాకు ‘ఊ అంటావా..’ పాట సవాల్‌లా అనిపించింది. అయితే సెక్సీగా కనిపించడం అనేది నా ఆలోచన కాదు కాబట్టి ఆ పాట చిత్రీకరణ అప్పుడు వణికిపోయాను. కానీ ఓ వ్యక్తిగా, నటిగా నాకు అసౌకర్యంగా అనిపించినవి, క్లిష్టమైన  పరిస్థితులను ఎదుర్కోవడం నుంచే నేను ఎదిగాను. ‘ఊ అంటావా..’ పాట నాకు సౌకర్యం కాదనిపించినా కొత్తగా ఏదైనా చేయాలని చేశాను. నిజానికి ఆ పాట లిరిక్స్‌ నాకు సవాల్‌గా అనిపించాయి. అమ్మాయిలంటే అందం మాత్రమే కాదనేలా ఆ పాట ఉంటుంది. అది నచ్చి చేశాను’’ అన్నారు. ఇకపై ఇలాంటి పాటలు చేస్తారా? అనే ప్రశ్నకు ‘‘లేదు.. ఎందుకంటే ఇలాంటి సవాళ్లను స్వీకరించాలనుకోవడంలేదు’’ అన్నారు సమంత. ఇక ప్రత్యేక పాటలకు సమంత ‘ఊహూ’ అంటారని స్పష్టమైపోయింది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)