Breaking News

అలాంటి పాత్రలు చేయను: సమంత

Published on Mon, 11/11/2024 - 00:08

‘‘ప్రస్తుత సమాజంలో మహిళలకు న్యాయమైన ప్రాతినిధ్యం ఉండాలని భావిస్తున్నా. అందుకే సినిమాల్లో రెండు, మూడు సన్నివేశాలకే పరిమితమయ్యే పాత్రలు నేను చేయను’’ అంటున్నారు హీరోయిన్‌ సమంత. వరుణ్‌ ధావన్, సమంత ప్రధాన పాత్రల్లో రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వం వహించిన వెబ్‌ సిరీస్‌ ‘సిటాడెల్‌: హనీ బన్నీ’. అమేజాన్‌ ప్రైమ్‌లో ఈ సిరీస్‌ ఈ నెల 7 నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది. ప్రియాంకా చోప్రా నటించిన హాలీవుడ్‌ సిరీస్‌ ‘సిటాడెల్‌’కు ఇది ఇండియన్స్  వెర్షన్స్ . ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న సమంత ‘సిటాడెల్‌: హనీ బన్నీ’ సక్సెస్‌ పట్ల ఆనందం వ్యక్తం చేశారు.

ఇదే వేదికపై సినిమాల్లో మహిళల పాత్రల గురించి ఆమె మాట్లాడుతూ–‘‘ప్రేక్షకులను తక్కువ అంచనా వేయకూడదు. వారు అన్ని విషయాలను గమనిస్తారు. అందుకే ఏం చేసినా బాధ్యతగా చేయాలి. నేను ఒక విషయానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు దానికి సంబంధించిన పూర్తి బాధ్యత నాపై ఉంటుంది. అందుకే ఎన్నో విషయాల గురించి ఆలోచించి, పాత్రలను ఎంచుకుంటాను. ప్రస్తుతం సమాజంలో మహిళలకు న్యాయమైన ప్రాతినిధ్యం ఉండాలని భావిస్తున్నా. 

సినిమాల్లో కూడా రెండు, మూడు సన్నివేశాలకే పరిమితమయ్యే పాత్రలకు నేను దూరంగా ఉంటాను. అలాగే నేను చేసే ప్రకటనల విషయంలోనూ ఆలోచిస్తాను. ‘సిటాడెల్‌: హనీ బన్నీ’లో నటించడం నాకు సవాల్‌గా అనిపించింది. హీరోకు సమానమైన పాత్ర నాది. యాక్షన్స్  సన్నివేశాల్లోనూ హీరోతో సమానంగా చేశా. కానీ, ఇలాంటి అవకాశాలు అరుదుగా వస్తాయి. ఇలాంటి చాన్స్‌ల కోసం నటీమణులు చాలామంది ఎదురు చూస్తున్నారు. కానీ, నాకు ఇలాంటి అవకాశాలు ఎన్నో వచ్చినా అందులో కూడా కొన్నింటినే ఎంచుకుంటున్నాను. నాకు వచ్చిన ఆఫర్లకు, నేను చేసిన సినిమాలకు మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది’’ అని సమంత పేర్కొన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)