Breaking News

నాగచైతన్య సినిమాతో ఎంట్రీ.. సమంతకు అరుదైన గౌరవం

Published on Sun, 03/02/2025 - 16:39

టాలీవుడ్ హీరోయిన్ సమంత గతేడాది ఇండియన్ వర్షన్ వెబ్ సిరీస్‌ సిటాడెల్: హనీ బన్నీలో కనిపించింది. అయితే కొత్త ఏడాదిలో ఎలాంటి ప్రాజెక్ట్‌ను ప్రకటించలేదు. ఒకప్పుడు దక్షిణాదిలో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్‌లో రీ ఎంట్రీకి మాత్రం నానా తంటాలు పడుతోంది. తెలుగులో అవకాశాలు రాకపోవడంతో తన సొంత బ్యానర్‌లోని మా ఇంటి బంగారం పేరుతో ఓ సినిమాను నిర్మిస్తోంది.

అయితే తాజాగా సమంతను ఓ అవార్డ్ వరించింది. సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన 15 ఏళ్లు పూర్తి కావడంతో ప్రముఖ సంస్థ ఆమెను సత్కరించింది. చెన్నైకి చెందిన ఎంసీఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ప్రతినిధులు సమంతకు అవార్డ్‌ను అందజేశారు. బిహైండ్‌వుడ్స్‌ గోల్డ్ అందించే హాల్‌ ఆఫ్‌ ఫేమ్ అవార్డ్‌కు ఆమెకు అందించారు.  చెన్నైలో జరిగిన వేడుకలో సమంత ఈ అవార్డ్‌ను అందుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది సామ్. అంతేకాకుండా సిటాడెల్ వెబ్ సిరీస్‌కు కూడా మరో ‍అవార్డ్‌ను అందుకుంది ఈ ముద్దగుమ్మ.

(ఇది చదవండి: 'అన్ని చెడులకు అదే కారణం'.. రిలేషన్స్‌పై సమంత కామెంట్స్)

కాగా..  సమంత 2010లో అక్కినేని నాగచైతన్య సరసన ఏ మాయ చేసావే అనే సినిమాతో తొలిసారిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వత పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. టాలీవుడ్ ‍‍అగ్రహీరోల సరసన నటించి ప్రశంసలు అందుకుంది. సామ్ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి 15 ఏళ్లు పూర్తి కావడంతో అవార్డ్ అందుకున్నారు. ఈ  కార్యక్రమంలో సిటాడెల్ హనీ బన్నీ డైరెక్టర్స్ రాజ్ నిడిమోరు, డీకే కూడా హాజరయ్యారు.

raj

రాజ్ నిడిమోరుతో డేటింగ్‌ వార్తలు

కాగా.. ఇటీవల రాజ్ నిడిమోరుతో డేటింగ్‌ ఉందంటూ సమంతపై వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. చెన్నైలో జరిగిన పికిల్ బాల్ టోర్నమెంట్‌లో వీరిద్దరు జంటగా కనిపించడంతో మరోసారి రూమర్స్ వినిపించాయి. ఈ నేపథ్యంలోనే మరోసారి సమంత, రాజ్ నిడిమోరు ఓకే వేదికపై మెరిశారు. దీంతో మరోసారి సమంతపై డేటింగ్‌ రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. అయితే వీటిపై ఇప్పటికే సామ్ కానీ.. రాజ్ నిడిమోరు కానీ స్పందించలేదు. 
 

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)