amp pages | Sakshi

సిద్దూ జొన్నలగడ్డతో సమంత? యంగ్‌ హీరోకు క్రేజీ ఆఫర్‌

Published on Sat, 05/20/2023 - 10:01

స్టార్‌ హీరోయిన్‌ సమంత ప్రస్తుతం పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది.పాన్‌ ఇండియా మూవీ ఖుషితో పాటు సిటాడెల్‌ వంటి వెబ్‌ సిరీస్‌లో నటిస్తోంది. ఇటీవల ఆమె నటించిన శాకుంతలం భారీ డిజాస్టర్‌గా నిలిచింది.ఇక ఈ మూవీ రిజల్ట్ గురించి పెద్దగా పట్టించుకోని సామ్‌ తను తర్వాత చేయబోయే సినిమాలై దృష్టి పెట్టింది. ఇప్పటికే కమిట్‌ అయిన ఖుషి, సిటాడెల్‌ తర్వాత సమంత ఓ యంగ్‌ హీరోతో జతకట్టనుందట.

ఇండస్ట్రీలో క్రేజీ హీరోగా పేరున్న ఆ హీరోతో సామ్‌ ఓ మూవీ చేయబోతుందని ఇన్‌సైడ్‌ సినీ సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ హీరో మరెవరో కాదు సిద్దు జొన్నలగడ్డ. డీజే టిల్లుతో ఇండస్ట్రీలో క్రేజీ హీరోగా మార్క్‌ సంపాదించుకున్నాడు సిద్దు. డీజే టిల్లులో సిద్దు యాక్టింగ్‌, డైలాగ్‌ డెలివరీకి ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. వన్‌ మ్యాన్‌ షోలా డీజే టిల్లు మూవీని ఒంటి చేత్తో హిట్‌ చేయించాడు సిద్దు. దాంతో అతడు రాత్రికి రాత్రే స్టార్‌డమ్‌ తెచ్చుకున్నాడు. చదవండి: Jr Ntr : జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫస్ట్‌ రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా?

ఇక ఈ క్రేజీ హీరోతో సినిమా చేసేందుకు నిర్మాత రామ్‌ తళ్లూరి ప్లాన్‌ చేస్తున్నాడ. ఈ ప్రాజెక్ట్‌కి నందినీరెడ్డి దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. నందినిరెడ్డి-సమంతల మధ్య మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. ఓ బేబీ మూవీ నుంచి నందిని రెడ్డి, సమంతలు మంచి స్నేహితులయ్యారు. సోషల్‌ మీడియాలో వారిద్దరు ఎప్పుడూ సరదాగా చిట్‌చాట్‌ చేసుకుంటుంటారు.

దాంతో నందినిరెడ్డి ఈ ప్రాజెక్ట్‌ గురించి చెప్పడంతో సమంత పాజిటివ్‌గా రెస్పాండ్‌ అయినట్టు టాక్‌. ఇక స్టార్‌ హీరోయిన్‌ సమంత సరసన నటించే ఛాన్స్‌ను ఎవరు వదులుకుంటారు? అందుకే సిద్దూ కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం దీనిపై చర్చలు జరుగుతున్నాయట. అంతా ఒకే అయితే త్వరలోనే తెరపైకి సమంత-సిద్దు కాంబినేషన్‌ రానుందని టాక్‌. మరి ఈ వార్తలపై క్లారిటీ రావాలంటే అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ వచ్చే వరకు ఆగాల్సిందే. చదవండి: వెంకటేశ్‌ మూవీలో విలన్‌గా బాలీవుడ్‌ నటుడు.. ఫస్ట్‌ లుక్‌ చూశారా?

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌