నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా
Breaking News
సమంత ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. 'శాకుంతలం' వాయిదా?
Published on Thu, 02/02/2023 - 15:16
స్టార్ హీరోయిన్ సమంత అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ శాకుంతలం. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఈనెల 17న విడుదల కాబోతుంది. శకుంతల, దుష్యంతుడి ప్రేమకథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో దుశ్యంతుడి పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నారు. మోహన్ బాబు దుర్వాస మహర్షిగా కనిపిస్తుండగా, ప్రకాష్ రాజ్,అనన్య నాగల్ల తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
అల్లు అర్హ ఈ చిత్రంతో డెబ్యూ ఇవ్వనుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేస్తుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో త్వరలోనే ప్రమోషన్స్ మొదలు పెట్టనున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. శాకుంతలం సినిమాను వాయిదా వేసే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Tags : 1