Breaking News

లండన్‌లో సమంత.. ఆమె ధరించిన డైమండ్ జువెలరీ ఎన్ని కోట్లంటే?

Published on Fri, 04/21/2023 - 10:36

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో సమంత ఒకరు. ఇటీవలే ఆమె ప్రధానపాత్రలో నటించిన శాకుంతలం చిత్రంతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ఆమె సిటాడెల్‌ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. ఇంగ్లీష్‌లో రూసో బ్రదర్స్ తెరకెక్కించిన ఈ సిరీస్‌లో ప్రియాంక చోప్రా, రిచర్డ్ మాడెన్ జంటగా నటిస్తున్నారు. ఇదే సిరీస్‌ ఇండియన్‌ వెర్షన్‌లో సమంత, వరుణ్‌ ధావన్‌ కలిసి నటిస్తున్నారు. దీనికి రాజ్‌ అండ్‌ డేకే దర్శకత్వం వహిస్తున్నారు.

తాజాగా హాలీవుడ్ సిటాడెల్ ప్రీమియర్ షో ఈవెంట్‌ లండన్‌లో జరిగింది. ఈ వేడుకలో సమంత బ్లాక్‌ డ్రెస్‌లో, డైమండ్‌ నెక్లెస్‌తో సమంత సరికొత్త స్టైల్‌లో దర్శనమిచ్చింది.. అందులోనూ స్పెషల్ డైమండ్ జువెలరీతో మరింత అట్రాక్షన్‌గా కనిపించిది. ప్రస్తుతం సమంత ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతుండగా.. సమంత ధరించిన డ్రెస్, డైమండ్స్‌ నగలపైనే ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. 

లండన్‌లో జరిగిన సిటాడెల్ ప్రీమియర్‌లో దాదాపు రూ.65 వేల ఖరీదు చేసే విక్టోరియా బెక్​హామ్ క్రోచెట్ ప్యాచ్​వర్క్ స్కర్ట్​ ధరించినట్లు తెలుస్తోంది. అందుకు తగ్గట్లుగానే బల్గారీ డైమండ్ జ్యువెల్లరీతో మెరిసింది సామ్. సమంత ధరించిన స్నేక్ నెక్లెస్ ధర అక్షరాలా రూ.2.9 కోట్లు కాగా, చేతికి వేసుకున్న బ్రెస్‌లైట్ ధర రూ.2.6 కోట్లు ఉంటుందని సమాచారం.

ఈ  ప్రీమియర్‌ షోకు హాజరైన పలువురు సెలబ్రిటీలను సమంత తన కొత్త లుక్‌తో ఆకట్టుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను సమంత తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. సమంత ధరించిన జువెలరీ ధర తెలుసుకున్న నెటిజన్స్ అవాక్కవుతున్నారు. ఈ డబ్బులతో ఏకంగా ఒక సినిమానే తీయొచ్చని కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. సమంత సిటాడెల్ ఏప్రిల్ 28న అమెజాన్‏లో స్ట్రీమింగ్ కానుంది. 

Videos

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు