Breaking News

వృథా ఖర్చు.. చైతూపై సమంత ఇన్‌డైరెక్ట్ కామెంట్స్

Published on Sun, 11/24/2024 - 11:43

సమంత విడాకులు తీసుకుని దాదాపు మూడేళ్లు దాటిపోయింది. అయినా సరే ఇప్పటికీ పలు సందర్భాల్లో నాగచైతన్య ప్రస్తావన వస్తూనే ఉంటుంది. మరోవైపు నాగచైతన్య కూడా మళ్లీ పెళ్లికి సిద్ధమయ్యాడు. హీరోయిన్ శోభితతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నాడు. డిసెంబరు తొలివారం పెళ్లి జరగనుంది. సరే ఇదంతా పక్కనబెడితే ఇప్పుడు సమంత చేసిన ఓ కామెంట్స్ వైరల్ అవుతోంది.

(ఇదీ చదవండి: 'బాహుబలి' కోసం రెండేళ్లు పనిచేశా.. పక్కనబెట్టేశారు!)

నాగచైతన్యతో విడాకులు తీసుకున్న సామ్.. 'మయోసైటిస్' వ్యాధి బారిన తను పడ్డ విషయాన్ని బయటపెట్టింది. అలా కొన్నాళ్లపాటు చికిత్స తీసుకోవడంతో సరిపోయింది. దీంతో సినిమాలు పెద్దగా చేయలేదు. తెలుగులో చివరగా 'ఖుషి' చేసింది. ఇది వచ్చి ఏడాదిన్నర దాటిపోయింది. ఈమె చాన్నాళ్ల క్రితం చేసిన వెబ్ సిరీస్ 'సిటాడెల్: హనీ బన్నీ'.. ఈ నెల ప్రారంభంలో అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైంది. అంతంత మాత్రంగానే ఉందనే కామెంట్స్ వినిపించాయి.

ఆ సిరీస్ గురించి అందరూ చాలావరకు మర్చిపోయారు. అలాంటిది ఇప్పుడు మరోసారి ప్రమోషన్‌లో భాగంగా వరుణ్ ధావన్-సమంత ర్యాపిడ్ ఫైర్ ఆడిన ఓ వీడియోని అమెజాన్ ఓటీటీ రిలీజ్ చేసింది. ఇందులో చైతూ గురించి పరోక్షంగా సామ్ మాట్లాడింది. 'దేనికోసమైనా ఖర్చు చేసిన డబ్బు పనికిరాకుండా పోయిందా?' అని వరుణ్ ధావన్ అడగ్గా.. 'నా ఎక్స్ (మాజీ భర్త) ఖరీదైన గిఫ్ట్స్ కోసం' అని సమంత సమాధానమిచ్చింది. సరిగ్గా చైతూ రెండో పెళ్లికి కొన్నిరోజుల ముందు సామ్ ఇలా మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది.

(ఇదీ చదవండి: డైరెక్టర్ సుకుమార్ పనిమనిషికి ప్రభుత్వ ఉద్యోగం)

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)