Breaking News

ఇక్కడ ఏదీ శాశ్వతం కాదు.. అర్థమైతే మంచింది: సమంత

Published on Thu, 09/18/2025 - 07:01

సామాజిక మాధ్యమాలను బాగా వాడుకునే నటీమణుల్లో సమంత ఒకరు. తమిళం, తెలుగు భాషల్లో నటించి అగ్ర కథానాయకిగా ఏలిన ఈ అమ్మడు ఆ మధ్య మయోసైటీస్‌ అనే అరుదైన వ్యాధికి గురికావడంతో అది  కెరీర్‌కు బాగా ఎఫెక్ట్‌ అయ్యింది. ఆ వ్యాధి నుంచి కోలుకున్నా, కథానాయకిగా మాత్రం బిజీ కాలేకపోతున్నారు. ఇటీవల నిర్మాతగా మారి శుభం అనే చిత్రాన్ని నిర్మించి అతిథి పాత్రలో నటించారు. ఆ చిత్రం మంచి పేరునే తెచ్చిపెట్టింది. అయినా తర్వాత చిత్రం గురించి ఎలాంటి ప్రకటన రాలేదు. అదేవిధంగా ఈమె మళ్లీ తమిళ చిత్రంలో హీరోయిన్‌గా నటించడానికి సిద్ధం అవుతున్నట్లు వార్తలు వెలువడ్డాయి. కానీ దాని గురించి అధికారిక ప్రకటన వెలువడలేదు. 

అయితే సమంత మాత్రం ఏదో ఒక వార్తతో నిత్యం ప్రైమ్‌ టైమ్‌లో ఉండే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అలా తాజాగా సమస్యల కారణంగా తాను చాలా విషయాలను నేర్చుకున్నానని ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.అదేవిధంగా ఇక్కడ కథానాయకి కెరీర్‌గానీ, గ్లామర్, అభిమానులు, పాపులారిటీ ఏదీ శాశ్వతం కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఏదైనా కొంత కాలమేనని అన్నారు. ఒక నటిగా ఎదగడానికి చాలా అదృష్టానికి మించి చాలా కావాలన్నారు. తాను తన జీవితంలో నటిగా కంటే పెద్ద ప్రభావాన్ని చూపాలని కోరుకున్నానన్నారు. దాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం అని తెలిసిందన్నారు. 

ఇలా వేదాంతం పలుకుతున్న సమంత గురించి సామాజిక మాధ్యమాల్లో రకరకాల కామెంట్స్‌ చేస్తున్నారు. అభిమానులు మాత్రం సమంతకు ఫుల​్‌ సపోర్ట్‌గా నిలుస్తున్నారు. ఏదేమైనా సమంత మళ్లీ తెరపై ఎప్పుడు మెరుస్తుందో అని ఆమె అభిమానులు మాత్రం ఎదురు చూస్తున్నారు.  

Videos

నాగార్జున యాదవ్ పై పోలీసుల దౌర్జన్యం

KSR Live Show: ప్రభుత్వ మెడికల్ కాలేజీల చరిత్రలో చీకటి రోజు

మారని పాక్ బుద్ధి.. బాల్ తో అంపైర్ పై దాడి

ఉడతతో స్నేహం

సాక్షి రిపోర్టర్ పై పోలీసుల దౌర్జన్యం

మెడికల్ కాలేజీలు పేదల కోసం.. బినామీలకు ఇస్తానంటే ఊరుకోము

Watch Live: ఛలో మెడికల్ కాలేజ్

ఎన్ని అడ్డంకులు సృష్టించినా వెళ్లి తీరుతా.. బైరెడ్డి మాస్ వార్నింగ్

17 మెడికల్ కాలేజీల వద్ద నేడు YSRCP పోరుబాట

అమెరికాలో తెలంగాణ వాసి మృతి

Photos

+5

విజయవాడ : కనులపండువగా దసరా సాంస్కృతిక ఉత్సవాలు (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : ఉదయం ఉక్కపోత..సాయంత్రం కుండపోత వర్షం (ఫొటోలు)

+5

హైదరాబాద్ రోడ్డుపై అడవి జంతువులు..అవునా.. నిజమా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ట్రాఫిక్‌ సమ్మిట్‌–2025..ముఖ్య అతిథిగా సాయి ధరమ్ తేజ్ (ఫొటోలు)

+5

కోర్ట్‌ జంట రిపీట్‌.. ఈసారి బావమరదళ్లుగా..(ఫోటోలు)

+5

ఏపీలో అసలు ప్రభుత్వం ఉందా?: వైఎస్‌ జగన్‌ (ఫోటోలు)

+5

బ్యూటీఫుల్ శారీలో బ్యూటీ హీరోయిన్ నీలఖి పాత్ర (ఫోటోలు)

+5

దివినుంచి దిగి వచ్చిన తారలా ‘పరదా’ బ్యూటీ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మీనాక్షి చౌదరి (ఫోటోలు)

+5

'కిష్కింధపురి' మూవీ సక్సెస్ మీట్..ముఖ్య అతిథిగా సాయి దుర్గ తేజ్ (ఫొటోలు)