అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్
Breaking News
స్టైలిష్గా సామ్.. తన వాచ్ ధర ఎన్ని లక్షలో తెలుసా?
Published on Sun, 09/29/2024 - 19:29
చాలాకాలం తర్వాత సమంత మళ్లీ హడావుడి మొదలుపెట్టేసింది. ఇన్స్టాగ్రామ్లో వరుస ఫోటోషూట్స్ షేర్ చేస్తోంది. తను నటించిన సిటాడెల్: హనీ బన్నీ వెబ్ సిరీస్ను లండన్లో ప్రీమియర్ ప్రదర్శించడమే ఇందుకు కారణం! లండన్లో జరిగిన వెబ్ సిరీస్ ప్రీమియర్కు సిటాడెల్ ఒరిజినల్ వర్షన్ హీరోయిన్ ప్రియాంక చోప్రాతో పాటు సమంత సైతం హాజరైంది.
వాచ్ ధర..
ఈ సందర్భంగా ఆమె చేతికి ధరించిన వాచ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తన స్టైలిష్ లుక్ను రెట్టింపు చేసేలా ఉన్న ఈ వాచ్ ధర తెలిస్తే నోరెళ్లబెట్టడం ఖాయం. లగ్జరీ బ్రాండ్ బల్గరీకి చెందిన ఈ వాచ్ ధర రూ.45.5 లక్షలని తెలుస్తోంది. ఇది విన్న అభిమానులు ముక్కున వేలేసుకుంటున్నారు.
వెబ్ సిరీస్..
సమంత సినిమాల విషయానికి వస్తే.. ఆమె ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ సిరీస్ 'సిటాడెల్: హనీ బన్నీ' నవంబర్ 7 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. వరుణ్ ధావన్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సిరీస్కు రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు. అలాగే సామ్ 'మా ఇంటి బంగారం' అనే సినిమాను నిర్మిస్తోంది.
చదవండి: జయం రవితో అలాంటి రిలేషన్ లేదు'.. సింగర్ క్లారిటీ!
Tags : 1