Breaking News

ఏ మాయ చేశావే రీ రిలీజ్‌.. రూమర్స్‌పై స్పందించిన సమంత!

Published on Tue, 06/17/2025 - 18:44

టాలీవుడ్ హీరోయిన్ సమంత తెలుగు వెండితెరకు పరిచయమై ఇప్పటికే దాదాపు 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. ‍టాలీవుడ్‌లో ఏ మాయ చేశావే చిత్రం ద్వారా అడుగుపెట్టింది. ఈ మూవీలో అక్కినేని నాగ చైతన్య సరసన హీరోయిన్‌గా అభిమానులను మెప్పించింది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఈ లవ్ ఎంటర్‌టైనర్‌ చిత్రంలో జెస్సీ పాత్రలో మెరిసింది. ఈ మూవీ రిలీజై జూలై 18 నాటికి 15 ఏళ్లు పూర్తవుతోంది. దీంతో అక్కినేని ఫ్యాన్స్‌ కోసం ఏ మాయ చేశావే చిత్రాన్ని మరోసారి బిగ్‌ స్క్రీన్‌పై రిలీజ్ చేస్తున్నారు. 2010లో విడుదలైన ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ వచ్చేనెల 18న రీ రిలీజ్‌ కానుంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా కోసం మరోసారి చైతూ, సమంత ఓకే వేదికపై కనిపిస్తారంటూ వార్తలొస్తున్నాయి. విడాకుల తర్వాత వీరిద్దరిని జంటగా ఎక్కడా చూడలేదు. ఈ సినిమా ప్రమోషన్ల కోసం వీరిద్దరు కలిస్తే ఫ్యాన్స్‌ చూడాలని కోరుకుంటున్నారు. దీంతో సామ్- చైతూ ఏ మాయ చేశావే ప్రమోషన్లలో కలుస్తున్నారంటూ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. తాజాగా వీటిపై హీరోయిన్ సమంత స్పందించింది. ఇంతకీ ఆమె ఏమన్నారో చూసేయండి.

తాజాగా సమంత ఈ వార్తలను కొట్టిపారేసింది. నేను ఏ మాయ చేసావే సినిమాను ప్రమోట్ చేయడం లేదని చెప్పింది. ఈ సినిమాను నేను అస్సలు ప్రమోట్ చేయడం లేదు.. అయితే ఈ టాక్ ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియదు. ఈ సినిమాలోని జంటను కలిసి చూడాలని అభిమానులు ఇష్టపడొచ్చని.. కానీ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని మేము జీవించలేము కదా అంటూ సామ్ స్పష్టం చేసింది. దీంతో వీరిద్దరిని కలిసి చూడాలనుకుంటున్న అభిమానులకు నిరాశే ఎదురైంది.

తాను నటించిన మొదటి సినిమా ఏ మాయ చేసావే కాదని.. రాహుల్ రవీంద్రన్ నటించిన తమిళ చిత్రం మాస్కోవిన్ కావేరీ  అని సమంత వెల్లడించింది. అయితే ఆ సినిమా షూటింగ్‌ మధ్యలో చాలా గ్యాప్‌ రావడంతో ఎవరికీ ఆ సినిమా గుర్తులేదని చెప్పుకొచ్చింది. నేను నటించిన రెండో చిత్రం ఏ మాయ చేశావే.. ఈ సినిమాలోని ప్రతి షాట్ తనకు గుర్తుందని తెలిపింది. దీంతో సమంత, నాగ చైతన్య ఏ మాయ చేసావే ప్రమోషన్ల కోసం కలవడం లేదని స్పష్టంగా తెలుస్తోంది.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)