Breaking News

‘భాయ్‌కి ఏమైంది?..’ సల్మాన్‌ ఖాన్‌ ఆసక్తికర ట్వీట్‌

Published on Mon, 07/20/2026 - 07:06

కండలవీరుడు, బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ ఆరోగ్యంపై సోషల్‌ మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తోంది. ఇటీవల ఓ కార్యక్రమంలో కనిపించిన ఆయన తాజా లుక్‌ అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ఎప్పుడూ ఫిట్‌గా, ఎనర్జిటిక్‌గా కనిపించే సల్మాన్‌.. ఈసారి కాస్త సన్నగా, ముఖం మొత్తం పాలిపోయి కనిపించడంతో పలువురు అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు.

ముంబైలోని స్లమ్‌ రిహాబిలిటేషన్‌ అథారిటీ (SRA) కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమానికి సల్మాన్‌ ఖాన్‌ హాజరయ్యారు. అక్కడ ఆధునిక డేటా కలెక్షన్‌, వెరిఫికేషన్‌ సపోర్ట్‌ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. అలాగే లబ్ధిదారులకు ఇళ్ల తాళాలు అందించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో.. సల్మాన్‌ ఆరోగ్యంపై అభిమానుల మధ్య చర్చ మొదలైంది. కొందరు ఆయన బాగా సన్నబడ్డారని, అలసటగా కనిపిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కొందరేమో వయసు పైబడడం వల్లేనేమో అని చర్చించుకున్నారు.

సల్మాన్‌ ఖాన్‌(60) గతంలో ట్రైజెమినల్‌ న్యూరాల్జియా (Trigeminal Neuralgia) అనే నరాల సంబంధిత సమస్యతో బాధపడినట్లు వెల్లడించారు. తీవ్రమైన ముఖ నొప్పిని కలిగించే ఈ వ్యాధిని సాధారణంగా సూసైడ్‌ డిసీజ్‌ “Suicide Disease” అని కూడా పిలుస్తారు. ఈ సమస్య కారణంగా తాను ఒక దశలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నానని.. విదేశాల్లో చికిత్స సైతం తీసుకున్నానని ఆయన సల్మాన్‌ గతంలో తెలిపారు. అలాగే మెడకు సంబంధించిన సమస్యలు, నొప్పుల కారణంగా కూడా ఆయన గతంలో చికిత్స తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం వైరల్‌ అవుతున్న ఆయన తాజా లుక్‌కు ఈ ఆరోగ్య సమస్యలే కారణమా? అనే చర్చా జోరందుకుంది. 

అయితే సల్మాన్‌ ఖాన్‌ చేసిన ఓ ట్వీట్‌ ఇప్పుడు వైరల్‌గా మారింది. “Aap logon ki tabiyat kaisi hai?” (మీ అందరి ఆరోగ్యం ఎలా ఉంది?) అంటూ ఆయన అభిమానులను పలకరించారు. తాజాగా కనిపించిన లుక్‌తోనే ఆయన బ్లాక్‌ అండ్‌ వైట్‌లో స్టైలిష్‌ ఫొటో షూట్‌ ఫొటోలను పోస్ట్‌ చేసి మరీ ఆ ప్రశ్న వేశారాయన. దీంతో కొందరు సంతోషం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు అభిమానులు కూడా స్పందిస్తూ.. “ముందుగా మీ ఆరోగ్యం ఎలా ఉందో చెప్పండి భాయ్‌” అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ప్రస్తుతం సల్మాన్‌ ఆరోగ్యంపై అధికారికంగా ఆయన బృందం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఆయన కూడా నేరుగా స్పందించలేదు. అయితే ఆయన తాజా లుక్‌, ఆ తర్వాత చేసిన ట్వీట్‌ అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. పలువురు అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. “భాయ్‌ జాగ్రత్తగా ఉండండి”, “మీ ఆరోగ్యం ముఖ్యం” అంటూ సందేశాలు పంపుతున్నారు. మరికొందరు మాత్రం వయసు పెరుగుతున్నా సహజంగా కనిపించడం గొప్ప విషయమని ప్రశంసిస్తున్నారు.

ప్రస్తుతం సల్మాన్‌ ఖాన్‌ ‘మాతృభూమి’ అనే సినిమాలో నటిస్తున్నారు. అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆయన భారత సైన్యానికి చెందిన కల్నల్‌ పాత్రలో కనిపించనున్నారు. చిత్తరంగదా సింగ్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. మరోవైపు ఈద్‌ 2027 సందర్భంగా నయనతారతో ఓ కొత్త ప్రాజెక్ట్‌లోనూ సల్మాన్‌ కనిపించనున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించే ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్‌ దశలో ఉంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)