Breaking News

సల్మాన్ కంటే అతనే బెటర్‌.. నాకైతే నరకం చూపించాడు: మాజీ గర్ల్‌ఫ్రెండ్‌

Published on Fri, 11/01/2024 - 16:43

బాలీవుడ్‌ సల్మాన్ ఖాన్‌పై ఆయన మాజీ ప్రియురాలు సోమీ అలీ షాకింగ్ కామెంట్స్ చేసింది. అతన్ని ప్రముఖ గ్యాంగ్‌స్టార్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌తో పోల్చింది. అతనికంటే సల్మాన్‌ ఖాన్‌ చాలా ప్రమాదమని సంచలన ఆరోపణలు చేసింది. అంతేకాకుండా బాలీవుడ్‌లో తన ఎదుర్కొన్న పరిస్థితులు, అనుభవాలను పంచుకుంది. గతంలో సోమీ ‍అలీ.. సల్మాన్‌తో దాదాపు ఎనిమిదేళ్ల పాటు రిలేషన్‌లో ఉన్నారు.

సల్మాన్‌ ఖాన్ కంటే గ్యాంగ్‌స్టార్ బిష్ణోయ్‌ చాలా బెటర్ అని సోమీ అలీ అన్నారు.  సల్మాన్ నాతో వ్యవహరించిన విధంగా.. మరెవరితోనూ ప్రవర్తించలేదని తెలిపింది. సంగీతా బిజ్లానీ, కత్రినా కైఫ్‌తో మంచిగా వ్యవహరించినట్లు.. నాతో  ‍‍అలా ఉండలేదని పేర్కొంది. గతంలో ఒకసారి ఐశ్వర్యరాయ్‌తోనూ అసభ్యకరంగా ప్రవర్తించాడని.. అతని వల్లే ఆమె భుజానికి గాయం కూడా అయిందని వెల్లడించింది. కానీ కత్రినాతో ఎలా వ్యవహరించాడో తనకు తెలియదని సోమీ చెప్పింది. ఒకసారి  సల్మాన్ నన్ను కొడుతుంటే పనిమనిషి తలుపులు వేసి కాపాడిందని గుర్తు చేసుకుంది. అందుకే సల్మాన్ కంటే లారెన్స్‌ బిష్ణోయ్ బెటర్‌ అని సోమీ ‍అలీ చెప్పింది.

గతంలో నటి టబు తన పరిస్థితిని చూసి బాధపడిన సందర్భాన్ని కూడా ఆమె గుర్తు చేసుకున్నారు. నన్ను చూసి టబు ఏడ్చిందని.. కానీ ఆ సమయంలో నేను ఎలా ఉన్నానో కనీసం చూడటానికి కూడా సల్మాన్ రాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. సల్మాన్ ఖాన్‌తో తాను పడిన కష్టాలు పూర్తిగా తన తల్లికి,  కొంతమంది సన్నిహితులకు మాత్రమే తెలుసని సోమీ వెల్లడించింది.  ప్రస్తుతం ఒక పుస్తకాన్ని రాసే పనిలో ఉన్నానని.. అందులో ప్రతి విషయాన్ని వివరిస్తానని సోమీ తెలిపింది. 
 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)