Breaking News

రూ.50 కోట్ల రెమ్యునరేషన్ తగ్గించుకున్న స్టార్ హీరో!

Published on Sat, 08/01/2026 - 21:19

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రస్తుతం తెలుగు దర్శకుడ వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్ రాజుతో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. SVC63 పేరుతో తీస్తున్న ఈ ప్రాజెక్ట్ షూటింగ్ జరుగుతోంది. అయితే ఒక్కో మూవీకి రూ.120 కోట్ల వరకు రెమ్యనరేషన్ తీసుకుంటాడనే టాక్ ఉన్న సల్మాన్.. దీని కోసం మాత్రం రూ.70 కోట్లే తీసుకుంటున్నాడని బాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. ఇంతకీ ఏంటి కారణం?

(ఇదీ చదవండి: సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్)

వచ్చే ఈద్ టార్గెట్‌గా తీస్తున్న ఈ సినిమా కోసం సల్మాన్ ఖాన్ పారితోషికం తగ్గింపు నిర్ణయం తీసుకోవడం వెనక ఆయన సన్నిహిత మిత్రుడు రఫీ కాజీ ‍అనే కారణం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ సెట్ కావడంలో ఈయన కీలక పాత్ర పోషించాడని, నిర్మాతల్లో ఒకరిగా కూడా ఉన్నాడని సమాచారం. స్నేహితుడి కోసమే సల్మాన్ తన సాధారణ పారితోషికంతో పోలిస్తే భారీగా తగ్గించాడని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

అయితే అడ్వాన్స్ మొత్తంతో పాటు సినిమా లాభాల్లోనూ వాటాని సల్మాన్ తీసుకుంటున్నారా లేదా అనే విషయపై ప్రస్తుతానికైతే స్పష్టత లేదు. గత కొన్నేళ్లుగా చూసుకుంటే సల్మాన్ ఖాన్ తన సినిమాల్లో లాభాల భాగస్వామ్యానికి ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు. ముఖ్యంగా 2010లో రిలీజైన 'దబాంగ్' తర్వాత ఆయన కుటుంబ సభ్యులు లేదా సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ (SKF) బ్యానర్ ఎక్కువ శాతం చిత్రాలని నిర్మించింది. 'బాడీగార్డ్'ని ఆయన సోదరి అల్విరా ఖాన్ నిర్మించగా, 'దబాంగ్'ని సోదరుడు అర్బాజ్ ఖాన్ నిర్మించాడు.

ఇకపోతే సల్మాన్ ఖాన్ మరోవైపు 'మాతృభూమి' అనే వార్‌బ్యాక్ డ్రాప్ మూవీ చేశాడు. గాల్వాన్ లోయ ఘర్షణ నేపథ్యం కావడంతో ప్రస్తుతానికి దీన్ని హోల్డ్‌లో పెట్టేసినట్లు తెలుస్తోంది. దీంతో ఇదెప్పుడు థియేటర్లలోకి వస్తుందో చెప్పలేని పరిస్థితి.

(ఇదీ చదవండి: ఓటీటీలో ఇంటెన్స్ హిందీ ప్రేమకథా సినిమా.. అధికారిక ప్రకటన)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)