Breaking News

బాల్కనీలో బుల్లెట్‌ ఫ్రూఫ్‌ కవచం.. తన కోసం కాదన్న సల్మాన్ ఖాన్!

Published on Wed, 07/23/2025 - 20:01

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఈ ఏడాది సికందర్‌ మూవీతో అభిమానులను ‍అలరించాడు. ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్‌గా నటించగా.. బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. ఇక సినిమాల సంగతి పక్కనపెడితే త్వరలోనే ప్రారంభం కానున్న బిగ్‌బాస్‌ సీజన్‌కు హోస్ట్‌గా చేయనున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం గాల్వాన్‌ లోయలో 2020లో భారత్‌–చైనా సైనికుల మధ్య జరిగిన యుద్ధం, ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంతో వస్తోన్న ‘బ్యాటిల్‌ ఆఫ్‌ గాల్వాన్‌ చిత్రంలో సల్మాన్‌ నటిస్తున్నారు. ఇందులో ఆర్మీ ఆఫీసర్‌ పాత్రలో కనిపించనున్నారు.

అయితే సల్మాన్‌ ఖాన్‌కు పలుసార్లు బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. కృష్ణ జింకను వేటాడిన కేసు తర్వాత సల్మాన్‌ను చంపేస్తామంటూ చాలాసార్లు బెదిరించారు. దీంతో ముంబయిలోని తన ఇంటివద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో భాగంగానే తాను నివాసముండే గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లోని బాల్కనీలో బుల్లెట్‌ ఫ్రూఫ్ గాజును ఏర్పాటు చేశారు. అక్కడి నుంచే ప్రతి ఏటా రంజాన్ సందర్భంగా అభిమానులకు విషెస్ చెబుతూ ఉంటారు.

అయితే తాజా ఇంటర్వ్యూలో ఆ బుల్లెట్ ఫ్రూఫ్ గాజును ఏర్పాటు చేయడంపై సల్మాన్ ఖాన్ స్పందించారు. అయితే ఇది తన వ్యక్తిగత రక్షణ కోసం కాదని.. నా అభిమానులు కొందరు బాల్కనీ పైకి ఎక్కకుండా.. వారిని తన ఇంట్లోకి రాకుండా నివారించేందుకేనని తెలిపారు. అయినప్పటికీ కొందరు ఫ్యాన్స్ బాల్కనీ పైకి ఎక్కి నిద్రిస్తున్నారని సల్మాన్ ఖాన్ వివరించారు.

అయితే ఇటీవల సల్మాన్ నివాసం వెలుపల ప్రత్యక్షంగా కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వాట్సాప్ ద్వారా బెదిరింపులు కూడా వచ్చాయి. ఈ సంఘటన తర్వాత సల్మాన్ ఖాన్ బుల్లెట్ ఫ్రూఫ్ గాజును ఏర్పాటు చేయించారు. అంతే కాకుండా కారులో బాంబు పెడతామని కూడా బెదిరించారు. కొంతకాలంగా సల్మాన్‌ఖాన్‌కు గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ నుంచి బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వారు పలుమార్లు సల్మాన్‌ ఇంట్లోకి చొరబడే ప్రయత్నం చేశారు. దీంతో ముంబై పోలీసులు సల్మాన్‌కు భద్రత కల్పించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)