Breaking News

తమ్ముడి రెండో పెళ్లి.. నా మాట ఎప్పుడు విన్నాడని?: సల్మాన్‌

Published on Mon, 01/29/2024 - 13:08

ప్రేమించుకుంటే పెళ్లి చేసుకోవాలా? ఇదేం ప్రశ్న అనుకునేరు.. చాలామంది ప్రేమలో పడుతున్నారు.. కానీ ఎక్కువకాలం కొనసాగలేక బ్రేకప్‌ చెప్పుకుంటున్నారు. చివరాఖరకు పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటున్నారు. కొంతమంది మాత్రమే ఆ ప్రేమను పెళ్లితో పవిత్రబంధంగా మార్చుకుంటున్నారు. అయితే బాలీవుడ్‌ భాయ్‌జాన్‌ సల్మాన్‌ ఖాన్‌ మాత్రం షాదీ చేసుకునేదే లేదంటున్నాడు. అందుకే 58 ఏళ్ల వయసొచ్చినా సింగిల్‌గానే ఉంటున్నాడు. అతడి తమ్ముడిది ఇంకో దారి!

56 ఏళ్ల వయసులో ప్రేమ, పెళ్లి
ఐటం సాంగ్‌ హీరోయిన్‌ మలైకా అరోరాను పెళ్లాడిన ఇతడు కొడుకు పుట్టాక ఆమెతో తెగదెంపులు చేసుకున్నాడు. 56 ఏళ్ల వయసులో మేకప్‌ ఆర్టిస్ట్‌ షురా ఖాన్‌తో ప్రేమలో పడ్డాడు. ఇంకేముంది, ఆలస్యం చేయకుండా గతేడాది చివర్లో నిఖా చేసుకున్నాడు. ఆదివారం నాడు(జనవరి 29న) సల్మాన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న హిందీ బిగ్‌బాస్‌ 17వ సీజన్‌ గ్రాండ్‌ ఫినాలేలో అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న కమెడియన్‌ భారతీ సింగ్‌.. పెళ్లికి తననెందుకు పిలవలేదని నిలదీసింది.

ఇంకెక్కడ పెళ్లి?
ఇందుకు అర్బాజ్‌.. నెక్స్ట్‌ పెళ్లికి పిలుస్తానులే అని సరదాగా వ్యాఖ్యానించాడు. 'తమ్ముడి పెళ్లిపై నీ రియాక్షన్‌ ఏంటి? నువ్వు ఎలాంటి సలహాలిచ్చావు?' అని సల్మాన్‌ను ప్రశ్నించింది లేడీ కమెడియన్‌. అందుకు సల్లూభాయ్‌ స్పందిస్తూ.. 'అతడు నా మాట ఎప్పుడు విన్నాడని? నా మాటలు విని ఉంటే..' అని మధ్యలోనే ఆపేశాడు. దీంతో అర్బాజ్‌ తన ప్రేమ-పెళ్లి వ్యవహారాల్లో సొంత అన్న మాట కూడా వినడని అర్థమైంది.ఇక పెళ్లెప్పుడు అన్న ప్రశ్నకు సల్మాన్‌ బదులిస్తూ.. 'ఇంకెక్కడ పెళ్లి.. నా జీవితంలో ఆ ముచ్చట ఉండదు' అని తేల్చేశాడు. ఇకపోతే బిగ్‌బాస్‌ 17వ సీజన్‌లో మునావర్‌ ఫరూఖి విజేతగా నిలిచాడు.

చదవండి: భార్యతో స్టార్‌ హీరో డ్యాన్స్‌.. ఆప్యాయంగా ముద్దాడుతూ..

Videos

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)