Breaking News

కరీనా కపూర్‌ బాత్రూమ్‌లో నా పోస్టర్‌ అతికించుకుంది: సల్మాన్‌ ఖాన్‌

Published on Wed, 06/25/2025 - 14:09

అభిమాన హీరో, హీరోయిన్ల ఫోటోలు, పోస్టర్లు గది నిండా నింపుకుంటుంటారు చాలామంది. అయితే ఓ హీరోయిన్‌ తన బాత్రూమ్‌లో స్టార్‌ హీరో పోస్టర్లు అతికించిందుకుందట! ఈ విషయాన్ని భాయ్‌జాన్‌ సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan) బయటపెట్టాడు. ఇంతకీ ఆ హీరోయిన్‌ మరెవరో కాదు.. కరీనా కపూర్‌! ఆమె అతికించిన పోస్టర్‌దో ఎవరికో కాదు సల్మాన్‌దే!

సల్మాన్‌పై ఫన్నీ పోస్టర్లు
సల్మాన్‌ ఖాన్‌.. ద గ్రేట్‌ ఇండియన్‌ కపిల్‌ షో మూడో సీజన్‌కు మొదటి గెస్టుగా విచ్చేశాడు. షోలో ప్రసారం చేయని అన్‌సీన్‌ ఫుటేజ్‌ను తన యూట్యూబ్‌ ఛానల్‌లో రిలీజ్‌ చేశాడు. అందులో రోడ్డు పక్కన, కళ్లజోడు దుకాణంలో, మెన్స్‌ సెలూన్‌లో సల్మాన్‌ను ఎలా వాడేస్తున్నారనేది తెలియజేస్తూ ఆయా పోస్టర్లను చూపించాడు. అవి చూసి నవ్వేసిన హీరో ఓ ఆసక్తికర విషయాన్ని తెలియజేశాడు.

కరీనా బాత్రూమ్‌లో నా పోస్టర్‌
కరీనా కపూర్‌ బాత్రూమ్‌లో కూడా నా పోస్టర్‌ ఉందని విన్నాను. తర్వాత నేనోసారి ఆమె ఇంటికి వెళ్లినప్పుడు చూశాను. అప్పుడామె వయసు 8 ఏళ్లుంటాయనుకుంటాను. తనకు 15 ఏళ్లొచ్చాక నా పోస్టర్‌ తీసేసి రాహుల్‌ రాయ్‌ పోస్టర్‌ పెట్టుకుంది అని చెప్పుకొచ్చాడు. కాగా కరీనా, సల్మాన్‌ బాడీగార్డ్‌, క్యూంకీ, బజ్‌రంగీ భాయ్‌జాన్‌ వంటి చిత్రాల్లో నటించారు.

ట్రిప్పుకెళ్తాం
బాలీవుడ్‌ ట్రియో (ఆమిర్‌ ఖాన్‌, షారూఖ్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌ త్రయం) గురించి చెప్తూ.. ఆమిర్‌ ఖాన్‌, నేను, షారూఖ్‌.. ముగ్గురం కలిసి ఓ ట్రిప్‌కు వెళ్దామని ఆమిర్‌ అన్నాడు. ఎవరికీ తెలియని ప్రదేశానికి వెళ్లాలనుకుంటున్నాం అన్నాడు. ఇంతలో అర్చన పూరణ్‌ సింగ్‌ కలగజేసుకుంటూ ఎవరికీ తెలియని చోటంటూ భూమిపై ఏదీ లేదు. మీరు చందమామ పైకి వెళ్తే బాగుంటుంది అని సలహా ఇచ్చింది. అందుకు హీరో నవ్వుతూ.. అవును, అది ట్రై చేయొచ్చు, కానీ ఎంతకాలం పడుతుందో చెప్పలేం అని సరదాగా అన్నాడు.

చదవండి: ఆయన కోపం, తిట్లు భరించలేకపోయా.. మధ్యలోనే వెళ్లిపోయా!

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)