Breaking News

సల్మాన్ ఖాన్‌తో సూపర్‌ హిట్‌ డైరెక్టర్‌ మూవీ.. ఆలస్యానికి అదే కారణం!

Published on Thu, 03/27/2025 - 14:08

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రస్తుతం సికందర్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం ఉగాది కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీకి కోలీవుడ్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్, సల్మాన్ ఫిల్మ్ ఖాన్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ బ్యానర్లపై  సాజిద్‌ నదియావాలా నిర్మించారు.

అయితే జవాన్‌ మూవీతో సూపర్ హిట్‌ కొట్టి కోలీవుడ్  స్టార్ డైరెక్టర్‌తో సల్మాన్ ఖాన్ చేయడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల నిర్వహించిన ప్రెస్‌ మీట్‌లో ఈ సినిమాకు సంబంధించిన ఓ కీలక విషయాన్ని వెల్లడించారు. ఈ మూవీ ఆలస్యం కావడంపై ఆయన స్పందించారు.

ఈ సినిమా బడ్జెట్‌పై అంచనాలు మరోసారి రూపొందిస్తున్నారని సల్మాన్ ఖాన్ వెల్లడించారు. అదే ఈ సినిమా ఆలస్యానికి ప్రధాన కారణమని తెలిపారు. ఈ ఏడాదిలోనే షూటింగ్ ప్రారంభించాలని నిర్ణయించినా బడ్జెట్ విషయంలో సమస్యలు రావడంతో వాయిదా పడిందని సల్మాన్ పేర్కొన్నారు. ఈ మూవీని ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరెకెక్కించనున్నట్లు తెలుస్తోంది. సల్మాన్ అభిమానులు ఈ ప్రాజెక్ట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

షారూఖ్ ఖాన్ జవాన్ తర్వాత అట్లీ చేస్తున్న రెండో హిందీ చిత్రం ఇదే కావడం విశేషం. రూ. 300 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన జవాన్ బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 1,150 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. 2023లో విడుదలైన జవాన్‌ మూవీలో నయనతార, దీపికా పదుకొనే, విజయ్ సేతుపతి, ప్రియమణి, సన్యా మల్హోత్రా నటించారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.
 

Videos

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)