వీర జవాన్‌గా సల్మాన్‌.. ఇది రొమాంటిక్‌ లుక్‌ కాదు!

Published on Sat, 01/31/2026 - 18:09

బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ హిట్టు కోసం పరితపిస్తున్నాడు. గతకొంతకాలంగా ఆయన చేసిన సినిమాలేవీ విజయాన్ని సాధించడం లేవు. దీంతో ప్రస్తుతం అతడు నటిస్తున్న "బ్యాటిల్‌ ఆఫ్‌ గల్వాన్‌" సినిమాపైనే ఆశలు పెంచుకున్నాడు. ఇటీవలే ఈ సినిమా నుంచి టీజర్‌ వదిలారు. అందులో ఓ సన్నివేశంలో సల్మాన్‌ లుక్‌, యాక్టింగ్‌పై ట్రోల్స్‌ వచ్చాయి.

సల్మాన్‌పై విమర్శలు
సైనికుడు చూపించే ధైర్యసాహసాలు అతడి ముఖంలో ఏమాత్రం కనిపించడం లేదని విమర్శలు వెల్లువెత్తాయి. వీటికి సల్మాన్‌ తాజాగా కౌంటరిచ్చాడు. ఈ మేరకు ఐఎస్‌పీఎల్‌ (ఇండియన్‌ స్ట్రీట్‌ ప్రీమియర్‌ లీగ్‌) ఈవెంట్‌లో మాజీ క్రికెటర్‌, యాంకర్‌ మహ్మద్‌ కైఫ్‌తో సల్మాన్‌ సంభాషిస్తున్న వీడియో క్లిప్‌ ఒకటి సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. అందులో కైఫ్‌.. సల్మాన్‌ను బ్యాటిల్‌ ఆఫ్‌ గల్వాన్‌లో ఎలా పోజిచ్చాడో అలా ఓ లుక్కివ్వమన్నాడు. 

నేను కల్నల్‌ని
అప్పుడు సల్మాన్‌.. ఇప్పుడు కొంతమంది ఇది రొమాంటిక్‌ లుక్‌ అనుకుంటారు.. కానీ, ఇది కల్నల్‌ పోజ్‌. తన జట్టును, సైనికులను ఎలా ముందుకు తీసుకెళ్లాలో బాగా తెలిసిన కల్నల్‌ ఇలాగే ఉంటాడు అంటూ ట్రోలర్స్‌కు చురకలంటించాడు . బ్యాటిల్‌ ఆఫ్‌ గల్వాన్‌ సినిమా విషయానికి వస్తే.. అపూర్వ లఖియా దర్శకత్వం వహించిన ఈ మూవీలో చిత్రాంగద సింగ్‌, అభిలాష్‌ చౌదరి కీలక పాత్ర పోషిస్తున్నారు. తెలంగాణకు చెందిన వీరజవాన్‌ కల్నల్‌ సంతోష్‌బాబు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఈ దేశభక్తి మూవీ ఏప్రిల్‌ 17న విడుదల కానుంది.

 

చదవండి:  ఐశ్వర్యరాయ్‌ తొలి సంపాదన ఎంతంటే?

Videos

EXCLUSIVE Video: 2000 మంది గూటీడీపీలతో ఎమ్మెల్యే గల్లా మాధవి విధ్వంసం

Guntur: అంబటి ఇంటిపై రాళ్లు, కర్రలతో దాడి కారు.. ఫర్నీచర్ ధ్వంసం

పోలీసుల సమక్షంలో అంబటిపై హత్యాయత్నం

మా ఇంటి ముందుకొచ్చి చెప్పు చూపిస్తారా?

Ambati : టీడీపీ నేతలు నన్ను తిట్టడంతోనే నేను ఆవేశంలో మాట్లాడాను

Ambati : చంద్రబాబును తిట్టలేదు.. బూతులతో నన్నే తిట్టారు..

YSRCP Leaders: నిజం నిప్పులాంటిది.. ఆ దేవుడే పట్టించాడు

KTR: రాత్రి పూట వచ్చి నోటీసులు అంటిస్తారా?

కేసీఆర్ ఇంటి గోడకు నోటీసు..!

మరో రికార్డ్ క్రియేట్ చేయబోతున్న FM నిర్మల సీతారామన్

Photos

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఫిబ్రవరి 01-08)

+5

ఒక్కచోట చేరిన బిగ్‌బాస్‌ సెలబ్రిటీలు.. కాకపోతే! (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియా ఓపెన్‌లో సంద‌డి చేసిన సానియా మీర్జా (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో దర్శకుడు అనిల్ రావిపూడి ఫ్యామిలీ (ఫొటోలు)

+5

‘అనగనగా ఒక రాజు’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

‘అనగనగా ఒక రాజు’ మూవీ సక్సెస్ మీట్ లో మెరిసిన మీనాక్షి చౌదరి (ఫొటోలు)

+5

బేబీ బంప్‌తో హీరోయిన్ సోనమ్ కపూర్ (ఫొటోలు)

+5

'కన్నప్ప' ఫేమ్ ప్రీతి ముకుందన్ గ్లామర్ (ఫొటోలు)

+5

వైభవంగా మేడారం మహా జాతర.. పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

సందడిగా వింగ్స్‌ ఇండియా..బేగంపేటలో ఆకట్టుకుంటున్న వైమానిక విన్యాసాలు (ఫొటోలు)