వెండితెరపై నాగదుర్గ వెలుగు

Published on Sun, 11/22/2026 - 13:32

రామగిరి (నల్లగొండ): జానపద పాటలు, కూచిపూడి నాట్యంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విశేష గుర్తింపు పొందిన నల్లగొండకు చెందిన నాగదుర్గ  వెండితెరపై వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘ఇడుపు కాయితం’ సినిమా షూటింగ్‌ ఇటీవల పూర్తయి విడుదలకు సిద్ధం కాగా.. తాజాగా  ‘శనార్తి’  చిత్రంలో నటించేందుకు అంగీకరించారు. 

జానపద గీతాల ద్వారా తన అభినయం, హావభావాలతో ప్రేక్షకులను అలరించిన నాగదుర్గ ఇప్పుడు పూర్తిస్థాయి సినీ నటిగా మారుతున్నారు. ఇప్పటికే ఆమె నటించిన ఇడుపు కాయితం చిత్రీకరణ పనులు పూర్తయి, విడుదల దశకు చేరుకున్నాయి. మరోవైపు కొత్త ప్రాజెక్ట్‌ శనార్తి సినిమాకు నాగదుర్గ పచ్చజెండా ఊపారు. కథాంశం, తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న నేపథ్యంలో ఈ చిత్రంపై ఆమె ఎంతో ఆశలు పెట్టుకున్నారు. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్న శనార్తి సినిమాతో ఆమె కెరీర్‌లో మరో కీలక ఘట్టం మొదలవనుంది. 

కళాసేవలోనూ ముందుంటూ...
ఒకవైపు జానపద పాటలు, యూట్యూబ్‌ ఇన్‌ఫ్లుఝెన్సర్‌గా, మరోవైపు సినిమా షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నా.. నాగదుర్గ తన మూలాలను, కళాసేవను మర్చిపోలేదు. పాట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో కూచిపూడిలో పీజీ పూర్తి చేసిన ఆమె, భవిష్యత్‌లో పీహెచ్‌డీ చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. నల్లగొండలో నాగదుర్గ నాట్యాలయం పేరుతో కూచిపూడి శిక్షణ కేంద్రాన్ని నిర్వహిస్తూ, విద్యార్థులకు నాట్యం నేర్పిస్తూ వారాంతాల్లో స్వస్థలానికి వచ్చి కళాభివృద్ధికి పాటుపడుతున్నారు.  

కూచిపూడి నుంచి మొదలైన పయనం
ఉమ్మడి నల్లగొండ జిల్లా అడ్డగూడూరు నాగదుర్గ స్వస్థలం. ఉద్యోగరీత్యా తల్లిదండ్రులు నల్లగొండలో స్థిరపడ్డారు. నాగదుర్గ పదో తరగతి వరకు నల్లగొండలో చదువుకుని, హైదరాబాద్‌లో ఇంటర్, బీఎస్సీ పూర్తి చేశారు. చిన్ననాటి నుంచే నృత్యంపై ఉన్న మక్కువతో కూచిపూడిలో శిక్షణ తీసుకున్నారు. 2021లో ‘తిన్నాతీరం పడతలే’ జానపద పాటతో నటనలోకి అడుగుపెట్టిన ఆమె. నాలుగేళ్ల వ్యవధిలో సుమారు 300 జానపద పాటల్లో నటించి యూట్యూబ్‌లో కోట్లాది వ్యూస్, 100 మిలియన్‌ మార్క్‌ను అందుకున్నారు. శాస్త్రీయ నృత్యం నుంచి జానపదంలోకి వచ్చి, ఇప్పుడు వరుస సినిమాలతో వెండితెరపై తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమయ్యారు.

 

Videos

బిస్లరీ వాటర్ తాగుతున్నారా.. అయితే అంతే సంగతి.. FSSAI షాకింగ్ ప్రకటన..

షర్మిల గారు మిమ్మల్నే అడుగుతున్న.. వీటికి సమాధానం చెప్పండి చాలు..

పాక్ చేతిలో భారత్ కు ఘోర ఓటమి...

పెళ్ళికొడుకు తరుపు వాళ్ళు ఎంత బాధ పడుతున్నారంటే.. రాంనాథ్ షాకింగ్ నిజాలు

కేవలం 1 లక్షతో 10 లక్షలు సంపాదించే ప్లాన్.!

రణబీర్, యష్ కాదు..! పార్ట్ 2లో ఆయనే హైలెట్...

కండువా కప్పుకోలేదంతే..! బాబు చిటికెయ్యగానే.. పెళ్లి ఉన్నా సరే బెంగళూరు వెళ్లిపోయింది..

పేర్ని కిట్టు ఆధ్వర్యంలో YSRCP చేరిన TDP సీనియర్ నేత

చెల్లి అడిగిందని సొంత ఆస్తి ఇచ్చాడు.. తనది కాని ఆస్తి ఎలా ఇస్తాడు?

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. లక్షకు దిగి రానున్న బంగారం..!

Photos

+5

‘భోగి’ మూవీ ప్రీ రిలీజ్... రెడ్‌ శారీలో మెరిసిన హీరోయిన్‌ డింపుల్ హయాతి (ఫోటోలు)

+5

కార్తీక సోమవారం.. శివనామస్మరణతో మార్మోగిన శివాలయాలు (ఫోటోలు)

+5

విశాఖపట్నం : కార్తీక సండే.. సందడి (ఫోటోలు)

+5

అనిరుధ్- కావ్య రిసెప్షన్‌లో సినీ, క్రీడా ప్రముఖుల సందడి.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ : కోటి దీపోత్సవంలో వైభవంగా మధుర మీనాక్షి కల్యాణం (ఫోటోలు)

+5

శర్వానంద్‌ ‘భోగి’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)

+5

మిర్నా తాజా ఫొటోలు..

+5

ప్రభాస్‌ బ్యూటీ.. చీరలో మెరిసి (ఫోటోలు)

+5

డేంజర్ బాయ్స్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. (ఫోటోలు)

+5

హై మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (ఫోటోలు)