Breaking News

వయసుతో పని లేదు... మనసు ముఖ్యం

Published on Thu, 07/23/2026 - 00:42

‘నేను నీకన్నా పెద్దవాణ్ణి... నాతో నీకు ప్రేమ సెట్‌ కాదు’... అంటాడు హీరో. ‘అయినా ఓకే... నేనేమైనా తప్పు చేస్తే... చిన్నమ్మాయి అని క్షమిస్తావ్‌... నువ్వేమైనా అంటే.. పెద్దోడు అని సర్దుకుపోతా’ అంటుంది హీరోయిన్‌. ఓ సినిమాలో లీడ్‌ క్యారెక్టర్స్‌కి మధ్య జరిగే సంభాషణ ఇది. హీరో వయసు ఫిఫ్టీ ప్లస్‌... హీరోయిన్‌కి 25 ప్లస్‌. హీరోని వెంటపడి ప్రేమిస్తుంది హీరోయిన్‌. అప్పుడు హీరో ‘ఏజ్‌ గ్యాప్‌’ గురించి మాట్లాడితే... ‘లవ్‌కి ఏజ్‌తో సంబంధం లేదు... మనసు ముఖ్యం’ అంటుంది. ఇలా హీరో–హీరోయిన్‌ మధ్య 15–20 ఏళ్లు గ్యాప్‌ ఉన్న కథతో ఎన్నో ప్రేమకథా చిత్రాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో త్వరలో మరో మూడు చిత్రాలు రానున్నాయి. ఆ విశేషాలు తెలుసుకుందాం...

నాకన్నా ఇరవైయేళ్లు చిన్నది...  
‘నాకన్నా ఇరవైయేళ్లు చిన్నది...’ అంటూ సూర్య చెప్పడం... ‘నాకు ప్రాబ్లం లేదు’ అని మమితా బైజు అనడం వంటి డైలాగులు ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’ చిత్రం ట్రైలర్‌లో ఉన్న విషయం తెలిసిందే. దీన్ని బట్టి చూస్తే ఈ సినిమా పక్కాగా ఏజ్‌ గ్యాప్‌ నేపథ్యంలో రూపొందిందని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సూర్య హీరోగా నటించిన చిత్రం ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’. వెంకీ అట్లూరి రచన, దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మమిత బైజు హీరోయిన్‌గా నటించారు. శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 14న తెలుగు–తమిళ భాషల్లో విడుదల కానుంది. 

‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’లో మమిత, సూర్య
ఈ సినిమా టీజర్, ట్రైలర్‌ చూస్తే సంజయ్‌ విశ్వనాథ్‌ అనే పిస్టల్‌ షూటర్‌ పాత్రని సూర్య పోషించారని అర్థం అవుతోంది. మ్యాడీ అనే పాత్రలో మమిత బైజు నటించారు. ప్రేమ... ప్రేమించమంటూ సంజయ్‌ విశ్వనాథ్‌ వెంట మ్యాడీ పడటం.. ‘నాకన్నా ఇరవైయేళ్లు చిన్నది... ఎలా’, ‘నువ్వు ఒక్క చిటికేస్తే నీ వయసు అబ్బాయిలు చాలా మంది వచ్చి ఇలా పడిపోతారు’ అంటూ సంజయ్‌ విశ్వనాథ్‌ అనగానే... ‘కావాలంటే ఇంకో నాలుగు చిటికెలు వేస్తా...  నువ్వు పడు చాలు’ అని మ్యాడీ అనడం వంటి డైలాగులు సినిమాపై ఆసక్తిని పెంచాయి. తనను ప్రేమించమంటూ మ్యాడీ వెంటపడటం.. వయసు తేడా వల్ల ఆమె ప్రేమని సంజయ్‌ విశ్వనాథ్‌ కాదనడం ట్రైలర్‌లో కనిపిస్తోంది. మరి... వీరి ప్రేమ ఎలాంటి మలుపులు తిరిగింది? అన్నది తెలియాలంటే ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’ రిలీజ్‌ వరకూ ఆగాల్సిందే.  

మరోసారి...  
హీరోయిన్‌ నయనతార మరోసారి ఏజ్‌ గ్యాప్‌ మూవీలో నటించారు. శింబు హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ‘వల్లవన్‌’ (తెలుగులో ‘వల్లభ’) చిత్రంలో తనకన్నా వయసులో చిన్నవాడైన శింబుని ప్రేమించిన పాత్రలో నటించి, మెప్పించారామె. తాజాగా నయనతార మరోసారి అలాంటి పాత్ర పోషించిన చిత్రం ‘హాయ్‌’. విష్ణు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యువ హీరో కెవిన్‌ హీరోగా నటించారు. ఈ చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది.

‘హాయ్‌’లో కెవిన్, నయనతార
 ఈ మూవీ కూడా ఏజ్‌ గ్యాప్‌ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. వయసులో పెద్దదైన మహిళ... యువకుడి మధ్య జరిగే ఎమోషనల్‌ రొమాంటిక్‌ డ్రామాగా ఈ మూవీ సాగుతుందని తెలుస్తోంది. ‘‘టైటిల్‌కు తగ్గట్టుగానే ‘హాయ్‌’ సింపుల్, హార్ట్‌ వార్మింగ్, ఫీల్‌గుడ్‌ సినిమా. ప్రతి కుటుంబం కలిసి చూసేలా మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించాం’’ అని యూనిట్‌ పేర్కొంది.

తొలి ప్రేమే మలి ప్రేమ కూడా! 
ప్రేమకథా చిత్రాలను సరైన రీతిలో తెరకెక్కిస్తే హిట్‌ గ్యారంటీ. అందుకు ఓ ఉదాహరణ మలయాళ దర్శకుడు గిరీష్‌ ఏడీ తెరకెక్కించిన ‘ప్రేమలు’ (2024). ఇప్పుడు ఈ దర్శకుడి నుంచి రానున్న ఎమోషనల్‌ లవ్‌స్టోరీ మూవీ ‘బెత్లెహెం కుడుంబ యూనిట్‌’. ఈ రొమాంటిక్‌ కామెడీ మూవీలో ఆష్లీ (మమిత బైజు) అనే యువతి విదేశాల నుంచి తన స్వగ్రామానికి తిరిగి వస్తుంది. తన  పక్కింట్లో జరుగుతున్న పెళ్లి వేడుకను చూసినప్పుడు ఆమెకు మొదటి ప్రేమికుడు జస్టిన్‌ (నివిన్‌ పౌలీ) గుర్తుకు వస్తాడు. ఆ జ్ఞాపకాలతో ఆమె జీవితంలో మళ్లీ భావోద్వేగాలు మొదలవుతాయి. అనుకోకుండా ఆష్లేకు జస్టిన్‌కి మళ్లీ ఎదురుపడే అవకాశం వస్తుంది.

‘బెత్లెహెం కుడుంబ యూనిట్‌’లో నితిన్‌ పౌలీ, మమిత
 
తొలి ప్రేమికుడితోనే మలి ప్రేమ మొదలవుతుంది. ఈ లవ్‌స్టోరీలో నితిన్‌ పౌలీ, మమిత  బైజు జంటగా నటించారు. నితిన్‌ వయసు 40 ప్లస్‌... మమితకు 25. ‘‘ఈ ఏజ్‌ గ్యాప్‌ లవ్‌స్టోరీ చాలా ఎమోషనల్‌గా ఉంటుంది’’ అని చిత్రదర్శకుడు గిరీష్‌ పేర్కొన్నారు. ఈ చిత్రం ఆగస్టు 21న విడుదల కానుంది. ఇక ఈ దర్శకుడు తెరకెక్కించిన ప్రేమకథా చిత్రం ‘ప్రేమలు’తో మమిత బైజుకి మంచి గుర్తింపు వచ్చింది. ఇంకో విషయం ఏంటంటే... ఇలాంటి ఏజ్‌ గ్యాప్‌ కాన్సెప్ట్‌తో ఆగస్టు 14న రానున్న ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’లోనూ మమిత కథానాయికగా నటించారు. ఇదే తరహా కాన్సెప్ట్‌తో రూపొందిన రెండు చిత్రాలతో వచ్చే నెలలోనే వారం గ్యాప్‌లో ఆమె స్క్రీన్‌పై కనిపించనుండటం విశేషం.  
 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)