Breaking News

ఒక్క మూవీతో ప్రేమలో పడ్డారా?.. సూపర్‌ హిట్‌ జంటపై డేటింగ్‌ రూమర్స్!

Published on Sun, 09/21/2025 - 07:22

ఈ ఏడాది బ్లాక్‌ బస్టర్‌ లిస్ట్‌లో రొమాంటిక్ లవ్ స్టోరీ సైయారా. చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ మూవీ ఏకంగా రూ.580 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రంలో అనీత్ పద్దా, అహాన్‌ పాండే జంటగా నటించారు. ఈ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. తొలి సినిమానే సూపర్ హిట్ కావడంతో అందరి దృష్టి వీరిద్దరిపైనే పడింది. దీంతో ఆన్‌ స్క్రీన్‌ జోడీ.. ఆఫ్‌ స్క్రీన్‌ లైఫ్‌లో జత కట్టనున్నారా? ‍‍అనే చర్చ మొదలైంది.

సైయారాలో అనీత్ పద్దా, అహాన్ పాండే కెమిస్ట్రీకి ఫిదా అయ్యారు. దీంతో నిజ జీవితంలోనూ డేటింగ్‌లో ఉన్నారని టాక్‌ తెగ వైరలవుతోంది. ఈ ఆన్‌ స్క్రీన్‌ జంట ప్రస్తుతం డేటింగ్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతానికి తన రిలేషన్‌ గోప్యంగా ఉంచారని టాక్ నడుస్తోంది. ఒక్క సినిమాకే వీరిపై డేటింగ్ రూమర్స్‌ వినిపిస్తున్నాయి. అయితే వీటిపై ఎవరూ కూడా స్పందించలేదు.

ఓ నివేదిక ప్రకారం నిర్మాత ఆదిత్య చోప్రాకు దగ్గరి వ్యక్తి ఒకరు 'సైయారా' సినిమా షూటింగ్ సమయంలో అనీత్, అహాన్ ప్రేమలో పడ్డారని చెప్పారట. ఈ మూవీ కూడా ప్రేమకథ కావడంతో.. 'సైయారా' సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు ఇది సహజంగానే జరిగిందని అన్నారట. షూట్‌లో మొదలైన స్నేహం.. ప్రేమగా మారిందని చెప్పాడట. ప్రస్తుతం ఈ జంట సాన్నిహిత్యంగా ఉన్నప్పటికీ.. ఎక్కడా బయట పడకుండా జాగ్రత్త పడుతున్నారని నివేదికలో వెల్లడైంది. నిజంగానే ఆన్-స్క్రీన్ జోడీ ఆఫ్-స్క్రీన్ జంట కానుందా అనేది క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

కాగా.. మోహిత్ సూరి దర్శకత్వం వహించిన 'సైయారా' జూలై 18న విడుదలైంది. ఈ ఏడాది బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండవ హిందీ చిత్రంగా ఘనత సాధించింది. ప్రస్తుతం ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. కేవలం ఐదు రోజుల్లోనే  ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వీక్షించిన ఆంగ్లేతర చిత్రంగా నిలిచింది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)