Breaking News

ఐదు నెలల తర్వాత ఓటీటీకి తెలుగు సినిమా.. ఎక్కడ చూడాలంటే?

Published on Fri, 06/20/2025 - 17:36

దర్శకుడు పూరీ జగన్నాథ్ సోదరుడు శ్రీరామ్ శంకర్ హీరోగా నటించిన చిత్రం  ఒక పథకం ప్రకారం. ఈ ఏడాదిలో ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. మలయాళ డైరెక్టర్ వినోద్ కుమార్ విజయన్ దర్శకత్వం వహించారు. క్రైమ్ థ్రిల్లర్‌ జోనర్లో వచ్చిన ఈ సినిమాలో శృతి సోది, ఆషిమా నర్వాల్, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు.

తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారు చేసుకుంది. రిలీజైన ఐదు నెలల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ నెల 27 నుంచి సన్‌ నెక్స్ట్‌లో అందుబాటులోకి రానుంది. ఈ సినిమా క్లైమాక్స్‌ యాక్షన్‌ సీన్‌ కోసం 25 డాగ్స్‌తో ఫైట్‌ సీన్‌ తెరకెక్కించారు. కాగా.. హీరో సాయిరాం శంకర్ 143, బంపర్ ఆఫర్ లాంటి సినిమాలతో టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్నారు. చాలా గ్యాప్ ఇచ్చిన ఈ ఏడాది ఒక పథకం ప్రకారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు.

ఒక పథకం ప్రకారం కథేంటంటే..

ఈ కథ మొత్తం 2014 విశాఖపట్నంలో జరుగుతూ ఉంటుంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ సిద్ధార్థ నీలకంఠ (సాయిరాం శంకర్) భార్య సీత (ఆషిమా నర్వాల్) షాపింగ్ కి వెళ్లగా అక్కడ భార్య మిస్ అవుతుంది. ఆమె ఏమైందో తెలియక ఇబ్బంది పడుతున్న సిద్ధార్థ డ్రగ్స్‌కు బానిస అవుతాడు. అయితే సిద్ధార్థతో కలిసి డ్రగ్స్ తీసుకునే దివ్య(భాను శ్రీ) అనూహ్యంగా దారుణమైన స్థితిలో హత్యకు గురవుతుంది. ఈ కేసు విచారణలో ఏసిపి రఘురాం(సముద్రఖని), సిద్ధార్థ ఈ మర్డర్ చేశాడని భావించి అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెడితే డ్రగ్స్ కేసు కారణంగా సస్పెండ్ కావడంతో ఆ స్థానంలో ప్రాసిక్యూటర్‌గా రావాలని ప్రయత్నించే చినబాబు (కళాభవన్ మణి) కూడా సిద్ధార్థని ఇరికించే ప్రయత్నం చేస్తాడు. అయితే తాను స్వతహాగా లాయర్ కావడంతో తాను హత్య చేయలేదని నిరూపించుకునే ప్రయత్నం చేస్తాడు సిద్ధార్థ్. తర్వాత ఇదే క్రమంలో అనేక హత్యలు జరుగుతున్నాయని తెలుసుకుని అసలు ఈ హత్యలకు కారణం ఎవరు అని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఈ ప్రయత్నంలో అతనికి ఏసీపీ కవిత(శృతి సోది) కూడా సహకరిస్తుంది. అసలు వరుస హత్యలు చేసేది ఎవరు? ఆ హత్యలకు సిద్ధార్థకి ఏమైనా సంబంధం ఉందా? సిద్ధార్థ్‌ను మాత్రమే ఇరికించాలని ఎందుకు ఏసీపీ, పబ్లిక్ ప్రాసిక్యూటర్ సహా మరి కొంత మంది ప్రయత్నించారనే ఆసక్తికర విషయాలు తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)