Breaking News

ఆయన బయోపిక్‌లో నటించాలని ఉంది

Published on Sun, 01/07/2024 - 01:05

తెలుగులోకి రావడానికి సరైన స్క్రిప్ట్‌ కోసం ఎదురు చూశాను. అది ‘సైంధవ్‌’తో కుదిరింది. వెంకటేశ్‌గారితో కలిసి పని చేయడం ఎవరికైనా ఓ డ్రీమ్‌గానే ఉంటుంది. యాక్షన్‌ సీక్వెన్స్‌లో చాలావరకూ ఆయన డూప్‌ లేకుండా చేశారు. సెట్స్‌లో ఎప్పుడూ కూల్‌గా, చాలా సహనంతో ఉంటారు. వెంకటేశ్‌గారి నుంచి ఈ విషయాన్ని నేర్చుకోవాలి. ఆయన చేసిన ఫ్యామిలీ సబ్జెక్ట్‌ మూవీస్‌ చూశాను. వెంకటేశ్‌గారి ‘అనారి’ (‘చంటి’) చిత్రం కూడా చూశాను.

‘సైంధవ్‌’లో కొంత తెలుగు, కొంత హిందీ మాట్లాడే ఓ హైదరాబాదీ పాత్ర నాది. సెట్స్‌లో నా తొలి రోజు చిత్రీకరణ యాక్షన్‌తో మొదలు కావడం కాస్త సవాల్‌గా అనిపించింది. ఇక బెస్ట్‌ మూమెంట్స్‌ అంటే.. శ్రీలంక షెడ్యూల్‌ మర్చిపోలేను. సముద్రంలో యాక్షన్‌ సీక్వెన్స్‌ కోసం బోట్‌ పై స్పీడ్‌గా వెళుతున్నాను. అకస్మాత్తుగా ఒక పెద్ద అల వచ్చింది. దాంతో ఒక్కసారి బోట్‌ వదిలేసి అలతో పాటు పైకి ఎగిరాను. అదృష్టవశాత్తు.. మళ్ళీ బోట్లోనే ల్యాండ్‌ అయ్యాను (నవ్వుతూ). ఆ సీన్‌ సినిమాలో ఉంటుంది. నా నటనకు మరొకరు డబ్బింగ్‌ చెప్పడం నాకు ఇష్టం లేదు. ఎంత కష్టమైనా డైలాగ్స్‌ నేర్చుకుని ఆ భాషలో డబ్బింగ్‌ చెప్పడమే ఇష్టం. అప్పుడే నా పాత్రలో ఉన్న ఇంటెన్స్, డెప్త్‌ తెలుస్తాయి.

శైలేష్‌ చాలాప్రోఫెషనల్‌ డైరెక్టర్‌. నటుడిగా నాది సుధీర్ఘమైన ప్రయాణం. శైలేష్‌ ఇండస్ట్రీకి వచ్చి తక్కువ సమయమే అవుతోంది. అయితే ఫిల్మ్‌ మేకింగ్‌ పరంగా అతనికి ఎంతో విషయ పరిజ్ఞానం, ఉందనిపించింది. నిహారిక ఎంటర్‌టైన్మెంట్స్‌ ప్రోఫెషనల్‌ ప్రోడక్షన్‌ హౌస్‌. ∙టాలీవుడ్‌ చాలాప్రోఫెషనల్‌. ఇక రజనీకాంత్‌గారి ‘పేట’ (2019) సినిమా తర్వాత తమిళ, తెలుగు నుంచి నాకు అవకాశాలు వచ్చాయి.. కానీ కుదర్లేదు. అప్పుడు ‘పేట’లా ఇప్పుడు ‘సైంధవ్‌’ సంక్రాంతికే విడుదలవుతుండటం హ్యాపీ. ఇక ఓషోగారి పాత్ర చేయాలన్నది నా డ్రీమ్‌. అవకాశం వస్తే ఆయన బయోపిక్‌లో నటిస్తాను.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)