Breaking News

OTTలో తెలుగు సినిమా.. నాలుగు నెలల తర్వాత స్ట్రీమింగ్‌

Published on Thu, 02/27/2025 - 14:14

తెలుగు సైన్స్‌ ఫిక్షన్‌​ థ్రిల్లర్‌ సినిమా రివైండ్‌ (Rewind Movie) ఓటీటీలోకి రాబోతోంది. గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం నాలుగు నెలల తర్వాత మార్చి 7న లయన్స్‌గేట్‌ప్లే (LionsgatePlay)లో అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని సదరు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అధికారికంగా ప్రకటించింది. తెలుగుతో పాటు హిందీ భాషలోనూ అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ప్రత్యేక పోస్టర్‌ రిలీజ్‌ చేసింది.

రివైండ్‌ సినిమా
సాయి రోనక్‌, అమృత చౌదరి హీరోహీరోయిన్లుగా నటించిన ట్రైమ్‌ ట్రావెల్‌ చిత్రం రివైండ్‌. సురేశ్‌, సామ్రాట్‌, వైవా రాఘవ్‌, జబర్దస్త్‌ నాగి, అభిషేక్‌ విశ్వకర్మ, ఫన్‌బకెట్‌ భరత్‌.. తదితరులు కీలక పాత్ర పోషించారు. కళ్యాణ్‌ చక్రవర్తి దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరించాడు. శివరామ్‌ చరణ్‌ సినిమాటోగ్రాఫీ అందించగా ఆశీర్వాద్‌ లూక్‌ సంగీతం సమకూర్చాడు. ఈ మూవీ 2024 అక్టోబర్‌ 18న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కథేంటంటే?
రివైండ్‌ కథ 2019 - 2024 మధ్యకాలంలో జరుగుతుంది. కార్తీక్‌ (సాయి రోనక్‌) సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. అతడి స్నేహితుడి అపార్ట్‌మెంట్‌లోని శాంతి (అమృత చౌదరి)ని చూసి ప్రేమలో పడిపోతాడు. హీరో పనిచేసే ఆఫీసులోనే ఆమె కూడా జాయిన్‌ అవడంతో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడుతుంది. ఒకరంటే మరొకరికి ఇష్టం.. కానీ ఎవరూ బయటకు చెప్పుకోరు. ఓరోజు శాంతి ఓ ముఖ్యమైన విషయం చెప్పాలంటూ కార్తీని కాఫీ షాపుకు రమ్మంటుంది.

సరిగ్గా అదే రోజు అతడి తాతయ్య (సామ్రాట్‌) కనిపెట్టిన టైం మిషన్‌ సాయంతో కార్తీక్‌ టైం ట్రావెల్‌ చేసి గతంలోకి వెళ్తాడు. తర్వాత ఏం జరిగింది? టైం ట్రావెల్‌లో అతడు ఏం తెలుసుకున్నాడు? చివరకు శాంతి, కార్తీక్‌ ఒక్కటయ్యారా? లేదా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

 

 

చదవండి: లావుగా ఉన్నానని హీరోయిన్‌గా పక్కనపెట్టేశారు: సోనాక్షి

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)