Breaking News

అనుకోని అవకాశం.. ఊహించిందే జరగబోతోంది!

Published on Wed, 01/28/2026 - 07:41

ఆచితూచి సినిమాలు చేసే హీరోయిన్లలో సాయిపల్లవి ఒకరు. గ్లామర్ రోల్స్ చేయొచ్చు. కోట్లకు కోట్ల రుపాయల రెమ్యునరేషన్ సంపాదించొచ్చు. కానీ తను అనుకున్న దారిలోనే వెళ్తూ, నచ్చి మూవీస్ చేస్తూ అద్భుతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం 'రామాయణ్' మూవీలో సీత పాత్ర చేస్తోంది. ఓ హిందీ చిత్రం రిలీజ్‌కి రెడీగా ఉంది. మరోవైపు దిగ్గజ గాయని ఎమ్మెస్ సుబ్బలక్ష‍్మి బయోపిక్‌లోనూ టైటిల్ రోల్ చేయనుందనే రూమర్స్ వస్తున్నాయి. ఇవన్నీ పక్కనబెడితే ఇప్పుడు అనుకోని అవకాశం ఈమెని వరించినట్లు తెలుస్తోంది.

ప్రభాస్ పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ 'కల్కి 2898 AD' సినిమా విషయంలో ఏం జరిగిందో మీ అందరికీ తెలిసిందే. దీనికి సీక్వెల్ తీసేందుకు మూవీ టీమ్ సిద్ధమవుతుందో.. దీపిక పదుకొణె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకొంది. గతేడాది ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అయితే దీపిక వద్దనుకున్న ఈ పాత్ర ఎవరు చేస్తారా అనే డిస్కషన్ అప్పుడు నడిచింది. ఇప్పుడు అది సాయిపల్లవిని వరించినట్లు సమాచారం. దాదాపు ఇది ఖరారైపోయిందని, త్వరలోనే ప్రకటన రావొచ్చని అంటున్నారు.

(ఇదీ చదవండి: 'ది రాజాసాబ్‌' నిర్మాతను గట్టెక్కించిన ప్రభాస్‌)

ఒకవేళ ఈ రూమర్స్ నిజమైతే గనుక ప్రభాస్‌, సాయిపల్లవి జోడీ సెట్ అవుతుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న దాని ప్రకారం దర్శకుడు నాగ్ అశ్విన్.. ప్రీ ప్రొడక్షన్ వర్క్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడని.. ఈ వేసవి నుంచి షూటింగ్ మొదలవుతుందని అనుకుంటున్నారు. మరి వినిపిస్తున్న పుకార్లు ఎంతవరకు నిజమనేది మూవీ టీమ్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

మూవీ టీమ్‌ ముందు సాయిపల్లవి కాకుండా వేరే ఆప్షన్స్ పెద్దగా లేనట్లే అనిపిస్తున్నాయి. ఎందుకంటే తెలుగులో ప్రస్తుతం 'సుమతి' పాత్రని పోషించిగల హీరోయిన్లు లేరని చెప్పొచ్చు. బాలీవుడ్, దక్షిణాదిలోని మిగతా భాషల్లో అయినా సరే ఆలియా భట్ లాంటి ఒకరిద్దరి పేర్లు పరిశీలించొచ్చు కానీ 'కల్కి' టీమ్, సాయిపల్లవి వైపు మొగ్గుచూపినట్లు అనిపిస్తుంది.

(ఇదీ చదవండి: మలయాళ బ్లాక్‌బస్టర్.. ఓటీటీలో ఇప్పుడు తెలుగులోనూ)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)