Breaking News

అందుకే నేను మేకప్‌ వేసుకోను.. సీక్రెట్‌ బయటపెట్టిన సాయిపల్లవి

Published on Sun, 04/02/2023 - 14:10

హీరోయిన్‌ సాయిపల్లవి చేసింది తక్కువ సినిమాలే అయినా సూపర్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకుంది. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ఫిదా సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ భామ తొలి సినిమాతోనే ప్రేక్షకుల మనసు దోచుకుంది. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్‌ను సొంతం చేసుకుంది. గతేడాది గార్గి సినిమాతో ముందుకు వచ్చిన సాయిపల్లవి చాలారోజులుగా మీడియాకు కూడా దూరంగా ఉంటుంది.

అయితే తాజాగా ముంబైలో జరిగిన ఓ ఈవెంట్‌కు హాజరైన ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ.. తాను మేకప్‌ లేకుండా నటించడానికి గల కారణాలను బయటపెట్టింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 'నేను చిన్నప్పటి నుంచి చాలా ఇన్‌సెక్యూర్‌గా ఫీల్‌ అయ్యేదాన్ని. నా వాయిస్‌ బాగోదు, మొహంపై మొటిమలు ఇలా చాలా విషయాలు నన్ను భయపెట్టేవి. మొదట్నుంచి నేను పెద్దగా మేకప్‌ వాడలేదు.

నా మొదటి సినిమా ప్రేమమ్‌లో కూడా నేను మేకప్‌ లేకుండా నాచురల్‌గా కనిపించా. నిజానికి ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో అని చాలా భయపడ్డా. కానీ సినిమా రిలీజ్‌ తర్వాత నన్ను నన్నుగా ప్రేక్షకులు ఇష్టపడ్డారు. నాకు వచ్చిన ఆదరణ చూసిన తర్వాత మరింత ఆత్మవిశ్వాసం వచ్చింది. అందుకే అప్పట్నుంచి సినిమాల్లో మేకప్‌ లేకుండానే నటించడానికి ఇష్టపడతాను. డైరెక్టర్స్‌ కూడా ఆ విషయంలో నన్ను ఎప్పుడూ మేకప్‌ వేసుకోవాలని బలవంత పెట్టలేదు' అంటూ చెప్పుకొచ్చింది. 

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)