Breaking News

క్రేజీ సినిమా.. రూ. 600 కోట్ల కలెక్షన్స్‌.. ఛాన్స్‌ వదులుకున్న సాయిపల్లవి

Published on Sun, 05/11/2025 - 07:00

ప్రతిభకు అదృష్టం తోడైతే అది నటి సాయి పల్లవి అవుతుంది. డాక్టర్‌ అయ్యి యాక్టర్‌ అయిన భామ ఈమె. సినిమాలపై ఆసక్తితో మొదట్లో ప్రయత్నాలు చేసిన ఆశించిన ఫలితం దక్కకపోవడంతో వైద్య విద్యపై పూర్తిగా దృష్టి సారించిన సాయి పల్లవి మధ్యమధ్యలో చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ తన కలలబాటలో పయనించిన సాయి పల్లవికి మలయాళ చిత్రం ప్రేమమ్‌తో విజయం వరించింది. ఆ ఒక్క విజయం ఆమె కెరీర్నే మార్చేసింది వరుసగా అవకాశాలు రావడం, అందులో బలమైన, నటనకు అవకాశం ఉన్న పాత్రలను ఎంచుకొని నటించడంతో సాయి పల్లవి తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. 

అలాంటి పాత్రలు తెలుగులోనే ఎక్కువగా రావడం విశేషం. కాగా ఇటీవల తమిళంలో శివకార్తికేయన్‌కు జంటగా నటించిన అమరన్‌ చిత్రంలో సాయి పల్లవి నటన మరోసారి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. కాగా తాజాగా ఈమె బాలీవుడ్‌ని కూడా టచ్‌ చేసింది. అక్కడ పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న రామాయణం చిత్రంలో  సీతగా నటిస్తోంది. ఈ సినిమాపై చాలా అంచనాలు నెలకొంటున్నాయి. ఇందులో సాయి పల్లవి నటించిన కొన్ని గ్లింప్స్‌ విడుదలై ఆసక్తిని  రేకెత్తిస్తున్నాయి. కాగా ఈమె ఈ చిత్రానికి భారీ మొత్తంలో పారితోషకం పుచ్చుకుంటున్నట్లు, ఎంత అంటే ఇప్పటి వరకు ఏ దక్షిణాది హీరోయిన్‌ తీసుకోనంత అనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో హల్‌ చల్‌ చేస్తోంది. 

ఇకపోతే ఈమె కథ, తన పాత్ర నచ్చితే కానీ చిత్రాలను అంగీకరించరన్నది తెలిసిందే. ఇంతకు ముందు చిరంజీవితో నటించే అవకాశాన్ని తిరస్కరించింది. అదేవిధంగా తమిళంలో నటుడు విజయ్‌ సరసన లియో చిత్రంలో నటించే అవకాశం ముందు సాయిపల్లవికే వచ్చిందట. అందులో ఆమె నటించడం దాదాపు ఖరారు అయ్యిందని, అయితే అందులో పాత్ర తనకు సంతృప్తిని కలిగించకపోవడంతో నిరాకరించినట్లు తాజాగా ప్రచారం సామాజిక మాధ్యమాల్లో హల్‌ చల్‌ చేస్తోంది.ఆ తరువాత ఆ పాత్రను నటి త్రిష పోషించింది.  

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)