Breaking News

ఎప్పుడు పిలుస్తారా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నా: సాయి పల్లవి

Published on Mon, 10/16/2023 - 12:27

దక్షిణాదిలో తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్న హీరోయిన్ సాయి పల్లవి. వచ్చిన అవకాశాలను కాకుండా నచ్చిన పాత్రలనే అంగీకరించి నటించే అతి కొద్దిమంది హీరోయిన్లలో సాయి పల్లవి ఒకరు. ఈమె ఇప్పటివరకు లభించిన చిత్రాలన్ని అలాంటివే. గార్గీ వంటి మూవీ సక్సెస్ తర్వాత సాయి పల్లవి ఇప్పటి వరకు తెరపై కనిపించలేదు అంతకుముందు తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన సాయి పల్లవి చాలా రోజులు సినిమాలేవీ లేకుండానే ఖాళీగానే ఉంది. అలా పలు అవకాశాలను తిరస్కరించిన ఈ సహజ నటికి తాజాగా భారీ బ్రహ్మాండ కథా చిత్రంలో నటించే అవకాశం వరించింది.

(ఇది చదవండి: ఒకప్పుడు టాటా నానో.. ఇప్పుడు బీఎమ్‌డబ్ల్యూ - అట్లుంటది కిమ్ శర్మ అంటే!)

 అదీ పాన్‌ ఇండియా స్థాయిలో రామాయణం వంటి ఇతిహాసం నేపథ్యంలో రూపొందనున్న చిత్రంలో నటించే అవకాశం రావడం నిజంగా సాయి పల్లవి అదృష్టమే అని చెప్పొచ్చు. అవును హిందీతో సహా పలు భాషల్లో అత్యంత భారీ బడ్జెట్లో రూపొందబోతున్న రామాయణం చిత్రంలో సాయి పల్లవి సీతగా నటించనున్నారు. ఈ చిత్రం గురించి అనధికారికంగా ఇప్పటివరకు చాలా ప్రచారం జరిగింది. కాగా నటి సాయి పల్లవి తొలిసారిగా రామాయణం చిత్రంలో సీతగా నటించబోతున్న విషయాన్ని దర్శకుడు నితీష్‌ తివారి తనను సీతగా ఎలా చూశారు అన్న భావనే తనను సంతోషంతో ఉక్కిరిబిక్కిరి చేస్తోందన్నారు. 

ఇది నిజంగానే తనను వరించిన అరుదైన అదృష్టంగా పేర్కొన్నారు. ఈ చిత్రం షూటింగ్‌కు ఎప్పుడు పిలుపు వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. ఇది కచ్చితంగా తనకు సవాల్‌తో కూడిన పాత్ర అని పేర్కొన్నారు. ఎందరో ప్రఖ్యాత నటీమణులు పోషించిన పాత్ర అని.. వారు నటించిన దాంట్లో తాను 10 శాతం చేసిన బాగా నటించినట్లే అని అభిప్రాయపడ్డారు. ఈ చిత్రం కథ వినడానికి త్వరలోనే ముంబయికి వెళుతున్నట్లు చెప్పారు. కాగా ఇప్పటికే భారతీయ సినీ చరిత్రలో పలు రామాయణం గ్రంథాలు చిత్రాలుగా రూపొందాయని, ఇప్పటివరకు వాల్మీకి రామాయణాన్ని ఎవరు సంపూర్ణంగా తెరపై ఆవిష్కరించలేదని.. ఆ కొరతను తమ రామాయణం తీరుస్తుందనే భావనను వ్యక్తం చేశారు. కాగా ఈ రామ చరితం నేపథ్యంలో రామాయణం చిత్రాన్ని మూడు భాగాలుగా తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

(ఇది చదవండి: శ్రీలీల ఎవరి అమ్మాయో తెలిస్తే అంటూ షాకిచ్చిన అనిల్‌ రావిపూడి)

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)