Breaking News

బికినీ ఫొటోలు.. వెటకారంతో క్లారిటీ ఇచ్చిన సాయిపల్లవి

Published on Fri, 09/26/2025 - 18:02

సాయిపల్లవి పేరు చెప్పగానే పద్ధతైన పాత్రలు, అద్భుతమైన డ్యాన్సులు గుర్తొస్తాయి. ఇలా కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్న ఈ బ్యూటీ.. బికినీ వేసుకుందని చెప్పి కొన్ని ఫొటోలని తెగ వైరల్ చేశారు. వారం పదిరోజలుగా ఇవి వైరల్ అయిపోయాయి కూడా. అయితే ఇవి నిజమేనని కొందరు, లేదంటే ఏఐ ఫొటోలని సోషల్ మీడియాలో వాదన జరిగింది. ఇదంతా ఎందుకని చెప్పి స్వయంగా సాయిపల్లవినే ఈ విషయంపై ఓ క్లారిటీ ఇచ్చింది.

(ఇదీ చదవండి: అల్లు శిరీష్ పెళ్లి చేసుకోబోతున్నాడా?)

ఈ ఏడాది 'తండేల్' మూవీతో హిట్ కొట్టిన సాయిపల్లవి.. ప్రస్తుతం 'రామాయణ్' అనే హిందీ మూవీలో నటిస్తోంది. కొన్నిరోజుల క్రితం షూటింగ్‌కి గ్యాప్ దొరికేసరికి చెల్లెలు పూజా కన్నన్, మరిదితో కలిసి ఫారిన్ ట్రిప్‌కి వెళ్లింది. ఈ క్రమంలోనే బీచ్ ఒడ్డున ఎంజాయ్ చేసింది. అక్కతో దిగిన కొన్ని ఫొటోల్ని సాయిపల్లవి చెల్లి పూజా తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. అయితే వీటిని మార్పింగ్ చేసిన కొందరు నెటిజన్లు.. బికినీ వేసుకున్నట్లు ఎడిట్ చేశారు.

తీరా ఇప్పుడు ట్రిప్ ఫుల్ వీడియోతో వచ్చేసిన సాయిపల్లవి.. 'పైన కనిపిస్తున్నవన్నీ నిజంగా తీసిన ఫొటోలు, ఏఐ ఫొటోలు కాదు' అని క్యాప్షన్ పెట్టింది. దీంతో అసలు బికినీ ఫొటోలన్నీ అబద్ధం అని వెటకారంతో క్లారిటీ ఇచ్చినట్లయింది. మరి ఇప్పటికైనా ఆమె ఫ్యాన్స్ నమ్ముతారా లేదంటే నిజంగానే బికినీ వేసుకుందని అనుకుంటారో మరి? సాయిపల్లవి చెల్లి పూజా కన్నన్ గతేడాది పెళ్లి చేసుకుంది. మరి ఈమె ఎప్పుడు చేసుకుంటుందో?

(ఇదీ చదవండి: మోహన్ లాల్ 'హృదయపూర్వం' సినిమా రివ్యూ (ఓటీటీ))

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)