Breaking News

ఆగిపోయిన మెగా హీరో పాన్‌ ఇండియా మూవీ.. ఇప్పట్లో లేనట్టేనా?

Published on Sun, 02/08/2026 - 11:48

టాలీవుడ్‌ కుర్ర హీరోలంతా ఇప్పుడు పాన్‌ ఇండియా మార్కెట్‌పై కన్నేశారు. ఒకటి, రెండు హిట్లు పడితే చాలు వెంటనే పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కిస్తున్నారు. మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌(సాయి దుర్గ తేజ్‌) కూడా ఇదే ట్రెండ్‌ ఫాలో అయ్యాడు. ‘బ్రో’ సినిమా తర్వాత చాలా గ్యాప్‌ తీసుకొని ‘సంబరాల యేటిగట్టు’అనే పాన్‌ ఇండియా సినిమాను లైన్‌లో పెట్టాడు. నూతన దర్శకుడు కేపీ రోహిత్‌ తో ‘హనుమాన్‌’నిర్మాతలు భారీ బడ్జెట్‌తో చాలా రోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్‌ని ప్రారంభించారు. 

కానీ ఆ బడ్జెట్‌ అంతా సినిమా మధ్యలోనే అయిపోయింది. అదనంగా డబ్బులు పెట్టి షూటింగ్‌ చేస్తున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. గతేడాది దసరాకే ఈ చిత్రం రిలీజ్‌ కావాల్సింది. కానీ బడ్జెట్‌ లేకపోవడంతో షూటింగ్‌ ఆలస్యం అయి.. అనుకున్న సమయానికి రిలీజ్‌ చేయలేకపోయారు. ఈ ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్‌ చేశారట. కానీ తాజా సమాచారం ప్రకారం వేసవిలో కూడా సినిమా రిలీజ్‌ కావడమే కష్టమే. 

ఈ మధ్య ఈ సినిమా నుంచి ఎలాంటి అప్‌డేట్‌ లేదు. అసలు షూటింగ్‌ పూర్తయిందా లేదా అనే సమాచారం కూడా లేదు. తేజు కూడా ఈ చిత్రాన్ని పక్కకు పెట్టినట్లు తెలుస్తోంది. షూటింగ్‌ ఆసల్యం కావడంతో..ఈ సినిమాను వదిలేసి కొత్త ప్రాజెక్టులపై ఫోకస్‌ పెట్టాడు. ‘సేవ్ ద టైగర్స్’ వెబ్ సిరీస్‌తో దర్శకుడిగా మారిన తేజ కాకుమానుతో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రానికి అనిల్ సుంకర నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. 

దీంతో పాటు ‘క’మూవీ సీక్వెల్‌లోనూ సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. కిరణ్‌ అబ్బవరం ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో  దర్శకులు సుజీత్, సందీప్.. సీక్వెల్‌కి తేజుని హీరోగా తీసుకోవాలని భావిస్తున్నారట. ఇటీవల కథ కూడా వినిపించారట. త్వరలోనే అధికారిక ప్రకటన ద్వారా ఈ విషయాన్ని వెల్లడించబోతున్నారు. ఇలా సాయి ధరమ్‌ తేజ్‌.. వరుసగా కొత్త సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం బట్టి చూస్తే.. ‘సంబరాల యేటిగట్టు’ఇప్పట్లో లేనట్టే అనిపిస్తోంది. ఇప్పుడు కాకపోయినా..ఎప్పుడో ఒక్కసారైనా రిలీజ్‌కి నోచుకుంటుందా లేదా చూడాలి మరి. 

Videos

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)