Breaking News

ఉషా పరిణయం చిత్రాన్ని ఆదరించాలి: సాయి దుర్గ తేజ్‌

Published on Tue, 07/30/2024 - 00:04

‘‘విజయభాస్కర్‌గారి దర్శకత్వంలో నేను ‘ప్రేమకావాలి’ సినిమా చేయాల్సింది... మిస్‌ అయ్యింది. ఆది సాయికుమార్‌ ‘రేయ్‌’ చేయాలి... కానీ ‘ప్రేమ కావాలి’ చేశాడు. నేను ‘రేయ్‌’ చేశాను. విజయభాస్కర్‌గారు కొత్తవాళ్లతో చేసిన ‘ఉషా పరిణయం’ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలి. అప్పుడే ఇలాంటి కొత్త సినిమాలు వస్తాయి’’ అన్నారు హీరో సాయి దుర్గ తేజ.. శ్రీ కమల్, తాన్వీ ఆకాంక్ష జంటగా నటించిన చిత్రం ‘ఉషా పరిణయం’. కె. విజయభాస్కర్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ మూవీ ఆగస్టు 2న విడుదలవుతోంది. 

ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన సాయి దుర్గ తేజ్‌ మాట్లాడుతూ– ‘‘నాకు ఎంతో ఆప్తుడైన సతీష్‌ అన్న కూతురు తాన్వీ ఆకాంక్షకి అన్నయ్యగా ఈ ఫంక్షన్‌కు వచ్చాను. ఈ మూవీ విజయం సాధించి యూనిట్‌కి మంచి పేరు తీసుకురావాలి’’ అన్నారు. విజయభాస్కర్‌ మాట్లాడుతూ– ‘‘14 ఏళ్ల క్రితం సాయి దుర్గ తేజ్‌ని నేనే హీరోగా పరిచయం చేయాల్సింది.. కానీ కుదరలేదు. మా ఫ్యామిలీ సపోర్ట్‌తో ‘ఉషా పరిణయం’ నిర్మించాను’’ అన్నారు. శ్రీ కమల్‌ మాట్లాడుతూ–  ‘‘నాన్నగారి (కె. విజయభాస్కర్‌) పేరు నిలబెట్టడానికి ప్రయత్నిస్తాను’’ అన్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)