Breaking News

తిరుమలలో పెళ్లి వార్త ప్రకటించిన సాయి దుర్గా తేజ్‌

Published on Mon, 11/17/2025 - 10:17

మెగా మేనల్లుడు సాయి దుర్గా తేజ్‌ (Sai Dharam Tej) తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సుప్రభాత సేవ తర్వాత బ్రేక్‌ దర్శనంలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చారు.

వచ్చే ఏడాదిలో తన వివాహం జరుగుతుందని  మీడియాతో సాయి దుర్గా తేజ్‌ చెప్పారు. తనకు మంచి సినిమాలతో పాటు మంచి జీవితం ఇచ్చిన శ్రీవారికి కృతజ్ఞతలు తెలిపేందుకు తిరుమల వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. త్వరలో కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్నామని దీంతో స్వామివారి ఆశీస్సులు తీసుకుని ముందుకు సాగాలని అనుకున్నట్లు చెప్పారు. వచ్చే ఏడాదిలోనే తాను నటించిన ‘సంబరాల ఏటిగట్టు’ విడుదలవుతుందన్ని గుర్తుచేశారు. ఆ సినిమా అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నట్లు కోరారు. అయితే, వచ్చే ఏడాదిలోనే తన పెళ్లి ఉంటుందని తేజ్‌ చెప్పడంతో అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.

‘సంబరాల ఏటిగట్టు’. ఈ చిత్రంలో సాయి దుర్గాతేజ్‌, ఐశ్వర్య లక్ష్మి జోడీగా నటిస్తున్నారు. రోహిత్‌ కేపీ దర్శకత్వంలో కె. నిరంజన్‌రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. వాస్తవంగా దసరాకు విడుదల కావాల్సిన ఈ మూవీ పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. అయితే, 2026లో  తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో   విడుదల కానుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)