Breaking News

అనుష్క సినిమాలకు గుడ్‌బై చెప్పినట్టేనా?

Published on Sat, 09/05/2026 - 23:21

దశాబ్దానికి పైగా టాలీవుడ్‌లో తన నటన, సౌందర్యంతో లేడీ సూపర్ స్టార్‌గా ఏకచక్రాధిపత్యం వహించింది నటి అనుష్క శెట్టి. ఆమె కథానాయిక ప్రాధాన్యమున్న సినిమాలతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాసిన విషయం తెలిసిందే. అయితే గత కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉండటం అనుష్క అభిమానుల్లో తీవ్ర నిరాశను నింపుతోంది. 'బాహుబలి'తో అనుష్క పాన్‌ ఇండియా స్టార్ హీరోయిన్ స్థానాన్ని సంపాదించుకుంది. 

అనుష్క శెట్టి సినిమాలకు దూరమవుతున్నారా? ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇదే చర్చ నడుస్తోంది. ఆమె చివరి చిత్రం ఘాటీ విడుదలై ఇప్పటికే 365 రోజులు పూర్తయ్యాయి. ఇప్పటివరకు మరో తెలుగు సినిమాను అనుష్క ప్రకటించలేదు. క్రేజ్ ఉన్నప్పటికీ వరుస సినిమాలు చేయకుండా.. నచ్చిన కథ, పాత్ర కోసం మాత్రమే ఎదురుచూడటం అనుష్క స్టైల్. అయితే ఇంత సుదీర్ఘ గ్యాప్ రావడంతో ఆమె ఇక సినిమాలు చేయరనే ప్రచారం మొదలైంది. అయితే అనుష్కపై ఇలాంటి ఊహాగానాలు ఇప్పటివి కావు. కొన్నేళ్లుగా ఆమె వ్యక్తిగత జీవితంపై, సినిమాలపై రకరకాల పుకార్లు వస్తూనే ఉన్నాయి. పాన్‌ ఇండియా స్టార్‌ హీరో ప్రభాస్‌తో లింక్ చేస్తూ అప్పట్లో ఆమెపై వచ్చిన కథనాలకు కొదవ లేదు. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు, ఆమె సినిమాలకు దూరమైందనే ప్రచారం కూడా నడిచింది.

అయితే దీనిపై అనుష్క నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. దీంతో ఆమె నిజంగానే సినిమాలకు గుడ్‌బై చెప్పారా? లేక మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో సర్‌ప్రైజ్ చేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. సాధారణంగా ఓ హీరో ఏడాది గ్యాప్ తీసుకున్నా పర్వాలేదు. కానీ అదే హీరోయిన్ తీసుకుంటే అంతే సంగతులు. ఇక అనుష్క లాంటి నటిని ఇలాంటి గ్యాప్స్ ఏం చేయలేవు. మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో వచ్చి మరో సూపర్‌ హిట్‌ కొడితే ఈ రూమర్స్‌ అన్నీ రూమర్స్‌గానే మిగిలిపోతాయి. అయితే ఇండస్ట్రీలో చాలామంది నుంచి మాత్రం ఇక ఆమె సినిమాలు చేయదనే టాక్‌ నడుస్తోంది. దీనిపై అనుష్క టీమ్‌ నుంచి ఏదైనా స్పందన వస్తుందేమో చూడాలి.

Videos

సాక్షి ఇన్వెస్టిగేషన్ లో సంచలన విషయాలు.. DSC అక్రమాలపై తిరుగులేని సాక్ష్యాలు

అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు

ACల దొంగలు.. వైరల్ అవుతున్న వీడియో

ధురంధర్ డైరెక్టర్ తో టాక్సిక్ హీరో.. పాన్ ఇండియా షేక్ చేసే కాంబో?

శ్రీ చరణి దెబ్బ అదుర్స్! 55 పరుగులకే పాక్ ఆలౌట్..

టీచర్ ఉద్యోగం కోసం 12 లక్షలు అడిగారు.. లోకేష్ మనుషులు వచ్చి మాట్లాడుతారు అంటూ..

SBI గుడ్ న్యూస్.. రూ.15 లక్షల స్కాలర్ షిప్!

10 రోజులుగా శిథిలాల కింద.. చివరకు ప్రాణాలతో బయటకు..!

DSCలో స్కాం జరగకపోతే CBI విచారణకు సిద్ధమా..?

పుట్టలో పాముల్లా బయటికొస్తున్న DSC అక్రమాలు

Photos

+5

‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ టీజర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో సీరియల్ బ్యూటీ.. బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ (ఫొటోలు)

+5

చెన్నైలో నా రోజు ఇలా గడిచింది (ఫొటోలు)

+5

అగ్నిపరీక్షలో గెలిచి 'బిగ్‌బాస్' 10లోకి రైతుబిడ్డ ఎంట్రీ (ఫొటోలు)

+5

దేవకన్యలా 'మ్యాడ్' ఫేమ్ అనంతిక (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘రన్ ఫర్ నేచర్'(ఫొటోలు)

+5

పింక్ బ్యూటీ ప్రియాంక మోహన్ (ఫొటోలు)

+5

'మారెమ్మ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)