Breaking News

జోడీ కుదిరిందా?

Published on Tue, 05/27/2025 - 02:01

‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి బ్లాక్‌ బస్టర్‌ మూవీ తర్వాత హీరో వెంకటేశ్‌ నటించనున్న చిత్రం ఏంటి? అనే విషయంపై స్పష్టత లేదు. అయితే హీరో వెంకటేశ్, డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా రానుందనే ప్రచారం ఇండస్ట్రీలో చాలా రోజులుగా జరుగుతూ ఉంది. అయితే ఈ కాంబినేషన్‌పై ఇప్పటి వరకూ అధికారిక ప్రకటన రాలేదు. అయినప్పటికీ వెంకటేశ్‌ తర్వాతి చిత్రం మాత్రం త్రివిక్రమ్‌తోనే అని ఫిల్మ్‌నగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ‘పుష్ప 2’ చిత్రం తర్వాత అల్లు అర్జున్‌ హీరోగా త్రివిక్రమ్‌ సినిమా ప్రారంభం అవుతుందనుకున్నారంతా.

అయితే తమిళ దర్శకుడు అట్లీ సినిమాకి ఓకే చెప్పారు అల్లు అర్జున్‌. జూన్‌లో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ సినిమా పూర్తవడానికి కనీసం ఏడాది అయినా పడుతుంది. అప్పటి వరకూ ఖాళీగా ఉండటం ఇష్టం లేని త్రివిక్రమ్‌.. వెంకటేశ్‌ ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టారని టాక్‌. ఈ సినిమాలో వెంకటేశ్‌కి జోడీగా రుక్మిణీ వసంత్‌ నటించనున్నారని సమాచారం.

హారిక అండ్‌ హాసినీ క్రియేషన్స్ పై ఎస్‌.రాధాకృష్ణ నిర్మించనున్న ఈ సినిమా జూన్‌ 6న అధికారికంగా ప్రారంభం కానుందని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. ఈ చిత్రంలో వెంకటేశ్‌కి జోడీగా రుక్ష్మిణీ వసంత్‌ని ఎంపిక చేశారట. నిఖిల్‌ హీరోగా నటించిన ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’(2024) సినిమాతో రుక్మిణీ వసంత్‌ తెలుగుకి పరిచయమయ్యారు. ప్రస్తుతం ఎన్టీఆర్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో ఆమె హీరోయిన్‌గా నటిస్తున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)