Breaking News

చిన్నపిల్లలు.. వాళ్లకేమైందని? మీ పిచ్చి సలహాలు..: నటి ఆగ్రహం

Published on Fri, 07/25/2025 - 18:48

పిల్లల్ని ప్రేమతో చూడాలి కానీ, ఒకరు నల్లగా ఉన్నారు, ఒకరు తెల్లగా ఉన్నారు అంటూ కలర్‌ గురించి మాట్లాడటమేంటి? అని అసహనానికి లోనైంది బుల్లితెర నటి రుబీనా దిలైక్‌ (Rubina Dilaik). తనకు ఏడాదిన్నర వయసున్న కవల పిల్లలున్నారు. తమ ఇంటికి వచ్చినవారు పిల్లల రంగు గురించి మాట్లాడటం నటికి ఏమాత్రం నచ్చలేదు. 

నా కూతుర్లకేమైందని..
దీని గురించి రుబీనా మాట్లాడుతూ.. నాకు పుట్టిన అమ్మాయిల్లో ఒకరు ఫెయిర్‌గా ఉంటే మరొకరు కాస్త డస్కీగా ఉంటారు. మా ఇంటికి వచ్చినవాళ్లు అదే విషయం పదేపదే ప్రస్తావిస్తున్నారు. ఒకరితో మరొకర్ని కంపేర్‌ చేస్తున్నారు. అది నాకస్సలు నచ్చలేదు. రంగు గురించి మాట్లాడొద్దు, నా కూతుర్లిద్దరూ అందంగా ఉన్నారని వాళ్లకు గట్టిగా ఆన్సరిచ్చేదాన్ని. ఇంకోసారి నా ఇంట్లో.. పిల్లల మధ్య పోలిక తేవొద్దని వార్నింగ్‌ ఇచ్చాను. మా బంధువులైతే.. పాపకు మంచి రంగు రావడం కోసం శనగపిండితో స్నానం చేయించమనేవారు. అసలు ఆ విషయం గురించి మీరు అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదని బదులిచ్చాను. 

చిన్నప్పటినుంచే నేర్పిస్తున్నా..
నా పిల్లలకేమైందని.. వారెంతో అందంగా ఉన్నారు. అలాగే ఇద్దరికీ ఆత్మస్థైర్యంతో ఉండాలని చిన్నప్పటినుంచే నేర్పిస్తున్నాను. అర్థం చేసుకోవడానికి వారిది చాలా చిన్నవయసు కానీ, ఇప్పటినుంచి నేర్పిస్తేనే విశ్వాసంతో ముందుకు వెళ్తారు అని చెప్పుకొచ్చింది. రుబీనా- అభినవ్‌ 2018లో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ హిందీ బిగ్‌బాస్‌ 14వ సీజన్‌లో పాల్గొన్నారు. రుబీనా ఈ సీజన్‌ ట్రోఫీ గెలిచింది. ఇకపోతే పెళ్లయిన ఐదేళ్లకు రుబీనా గర్భం దాల్చింది. 2023లో కవల కూతుర్లు ఏధ, జీవాకు జన్మనిచ్చింది.

చదవండి: గుండెలు పిండేసే చిత్రం.. హిట్టయితే బాగుండు: శృతి హాసన్‌

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు