Breaking News

'ఆర్‌ఆర్‌ఆర్‌' నటుడు స్టీవెన్‌ సన్‌ మృతికి కారణమిదే!

Published on Tue, 05/23/2023 - 09:04

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో మెయిన్‌ విలన్‌గా(స్కాట్‌ దొర) నటించిన హాలీవుడ్‌ నటుడు రే స్టీవెన్సన్ 58 ఏళ్ల వయసులో హ‌ఠాన్మ‌ర‌ణం చెందారు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో తెలుగు వాళ్లకు సుపరిచతమైన ఆయన మరణంతో సినీ పరిశ్రమ షాక్‌కి గురైంది. స్టీవెన్‌ సన్‌ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆర్‌ఆర్‌ఆర్‌ టీంతో పాటు పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

స్టీవెన్సన్ మృతికి తీవ్రమైన అనారోగ్యం కారణమని ఇటాలియన్‌ వార్త పత్రిక రిపబ్లికా వెల్లడించింది. ఇటలీలో తన కొత్త చిత్రం ‘క్యాసినో’ షూటింగ్‌ చేస్తుండగానే ఆయన మిస్టరీ ఇల్‌నెస్‌కు గురయ్యారు. దీంతో ఆయన్ను వెంటనే స్థానిక ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో పరిస్థితి విషమించి ఆయన మరణించారు అంటూ సదరు వార్తాసంస్థ తెలిపింది.

కాగా థోర్ సిరీస్‌తో పాపులర్‌ అయిన ఆయన కింగ్ ఆర్థర్, ది అదర్ గైస్,ది ట్రాన్స్‌పోర్టర్ వంటి పలు సినిమాల్లో నటించారు. చివరి సారిగా యాక్సిడెంట్ మ్యాన్ సినిమాలో కనిపించారు. ఆయన నటించిన మరో రెండు సినిమాలు, ఓ సిరీస్ రిలీజ్ కు రెడీగా ఉన్నాయి.స్టీవెన్ సన్ 1997లో బ్రిటిష్‌ నటి రుత్‌ గెమ్మెల్‌ను వివాహం చేసుకోగా 8ఏళ్ల తర్వాత విడాకులు తీసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం.

Videos

సచివాలయ ఉద్యోగులంటే చంద్రబాబుకు ఎందుకింత కక్ష..?

పెళ్లి చూసుకున్నవాళ్లకే దిక్కులేదు... 15 ఏళ్ళు కలిసుంటారట..!

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

ఓ బ్రాహ్మణ్ పై కక్ష్య సాధిస్తే... వేమిరెడ్డి దంపతులు ఇది నా ఆక్రందన! శ్రావణ్ శర్మ సతీమణి

సచివాలయం ఉద్యోగులను ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూడండి

ఈసీ నియామక విధానంపై జగన్ ప్రశ్నలు.. అసలు వివాదం ఏంటి?

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

Photos

+5

'ప్యారడైజ్'లో కేసీఆర్‌ని పోలిన పాత్ర.. షూటింగ్‌లో ఇలా(ఫొటోలు)

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)