Breaking News

బిగ్‌బాస్ 10: షాకింగ్.. రోహిత్ ఎలిమినేట్

Published on Sun, 11/01/2026 - 08:56

బిగ్‌బాస్ 10వ సీజన్ నుంచి రోహిత్ ఎలిమినేట్ అయ్యాడు. గతవారం డబుల్ ఎలిమినేషన్ జరగ్గా షాలిని, దక్షి ఔట్ అయ్యారు. ఈసారి కూడా అలానే ఉండబోతుందని టాక్ వినిపించింది. ఇప్పుడు అదే నిజమైంది. రైతుబిడ్డతో పాటు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ అయిన రోహిత్ ఎలిమినేట్ అయ్యాడు. షోలో ఇది టెలికాస్ట్ కాకముందే ఇతడి టీమ్ ఈ న్యూస్ బయటపెట్టేసింది.

(ఇదీ చదవండి: ఓటీటీలో మలయాళ థ్రిల్లర్ సినిమా.. క్రేజీ కాన్సెప్ట్)

ఈసారి రైతుబిడ్డ ఝాన్సీ ఎలిమినేట్ అయినట్లు ఇప్పటికే వార్తలొచ్చాయి. ‍అయితే హౌస్‌మేట్స్ ఓటింగ్‌తో రెడ్ లెవల్‌లో ఉన్న రోహిత్‌ని కూడా బయటకు పంపించేశారు. సాధారణంగా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌ని ఎలిమినేట్ చేస్తున్నట్లు చెప్పి సీక్రెట్ రూంలో ఉంచుతుంటారు. రోహిత్‌ని అలానే చేస్తారేమో అనుకున్నారు. కానీ హోస్ట్ నాగార్జున అలాంటి ఆప్షన్ ఇవ్వకుండా డైరెక్ట్ ఎలిమినేట్ చేసి పంపిచేశారని తెలుస్తోంది.

రోహిత్ పేరుకే స్ట్రాంగ్ కంటెస్టెంట్ గానీ గేమ్స్ పరంగా పెద్దగా ఆడింది లేదు. షాలినితో లవ్ ట్రాక్ నడపడం, త్రిగుణ్‌తో ప్రతిదానికి గొడవ పడటం తప్పితే వేరేగా చేసింది అయితే ఏం లేదు. బిగ్‌బాస్ కూడా తనని ఏం చేయలేడన్నట్లు యాటిట్యూడ్ చూపించాడు. ఇప్పుడదే ఇతడికి పెద్ద మైనస్ అయింది. సడన్ షాకిచ్చిన బిగ్‌బాస్.. ఎలిమినేట్ చేసి బయటకు పంపించేశాడు. అయితే ఇది ఊహించని రోహిత్ సోషల్ మీడియా టీమ్.. టెలికాస్ట్ కావడానికి ముందే ట్విటర్‌లో పోస్ట్ పెట్టేశారు. 'బ్యాన్ బిగ్‌బాస్' అని కూడా రాసుకొచ్చారు. మళ్లీ ఏమైందో ఏమో సదరు ట్వీట్ డిలీట్ చేసి ఇన్ స్టా స్టోరీలో మాత్రం కోపాన్ని బయటపెట్టారు.

టాప్-3లో ఉంటాడనుకున్న రోహిత్.. ఇలా ఇప్పుడు ఎలిమినేట్ అయిపోవడం బిగ్‌బాస్ ప్రేక్షకులకు నిజంగా షాకింగే అని చెప్పొచ్చు. రోహిత్ వెళ్లిపోయాడు కాబట్టి హౌస్‌లో టాప్‌కి ఎవరెళ్తారు? వచ్చే వారం నుంచి ఏం జరుగుతుందనేది చూడాలి?

(ఇదీ చదవండి: ఓటీటీలోకి కీర్తి సురేశ్‌ ‘అక్క’ రివ్యూ)

Videos

తీవ్ర తుఫాన్ గా మారనున్న మురసు

లోకేష్.. బాబులను చూస్తుంటే బాధేస్తుంది..! మీ పని గొవిందా... గోవింద

మొత్తం దొంగ ఓట్లు..? రీ-పోలింగ్ కి ఛాన్స్..?

Raptadu Incident: బుల్లెట్ దిగింది

అమెరికాలో కుప్పకూలిన ప్రైవేట్ జెట్.. 9 మంది ప్రయాణికులు మృతి

2029 తరువాత మిమ్మల్ని కుక్కలు కూడా... పులివెందులలో దాడులపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

పులివెందుల నుంచి బయలుదేరిన వైఎస్ జగన్

స్ట్రాంగ్ రూమ్ లలో కరెంటు కట్ చేసి... వరుదు కళ్యాణి సంచలన కామెంట్స్

దూసుకొస్తున్న మురసు తుఫాన్.. మళ్లీ భారీ వర్షాలు

జగన్ కే ఎదురెళ్ళావ్.. ఒక్క సైగ చేస్తే పీస్ పీస్ అయిపోయేవాడివి.. దస్తగిరి ఓవర్ యాక్షన్..

Photos

+5

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (నవంబర్ 01 -నవంబర్ 07)

+5

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ సొంతం చేసుకున్న భార‌త్‌ (ఫోటోలు)

+5

వైట్‌ డ్రెస్‌లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్.. (ఫోటోలు)

+5

ఎన్నికల్లో పచ్చ కుట్రలు.. ఆర్వో ఆఫీసు ఎదుట వైఎస్‌ జగన్‌ నిరసన (ఫోటోలు)

+5

చరణ్-సుకుమార్ కొత్త సినిమా లాంఛనంగా ప్రారంభం (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో సందడి సందడిగా హాలోవీన్‌ (ఫోటోలు)

+5

‘అక్క’ వెబ్‌సిరీస్‌ రిలీజ్... ట్రెండింగ్ హీరోయిన్ కీర్తి సురేశ్‌ (ఫోటోలు)

+5

40 ఏళ్లు దాటాయి అంటే ఎవరూ నమ్మరేమో! (ఫొటోలు)

+5

వరంగల్ :‌ నిట్‌లో సాంకేతిక మహోత్సవం టెక్నోజియాన్‌–26 ప్రారంభం (ఫోటోలు)