Breaking News

కాబోయే భర్తను పరిచయం చేసిన 'విజిల్‌' నటి

Published on Sun, 06/04/2023 - 19:37

తమిళ నటుడు రోబో శంకర్‌ ఇంట పెళ్లిబాజాలు మోగనున్నాయి. అతడి కూతురు ఇంద్రజ త్వరలో పెళ్లి పీటలెక్కనుంది. తనకు కాబోయే భర్తను సోషల్‌ మీడియాలో అభిమానులకు పరిచయం చేసింది. డైరెక్టర్‌ శంకర్‌తో తరచూ రీల్స్‌ చేస్తున్న ఇంద్రజ అతడితోనే ఏడడుగులు వేయనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు గుడిలో ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోలు షేర్‌ చేసింది. ఇది చూసిన నెటిజన్లు మీరు పెళ్లి చేసుకున్నారా? అని అడిగారు. దీనికి ఇంద్రజ స్పందిస్తూ.. పెళ్లికి ఇంకా ముహూర్తం పెట్టలేదని, ఆ పని పూర్తవగానే త్వరలోనే వెడ్డింగ్‌ డేట్‌ చెప్తానంది.

కాగా ఇంద్రజ బిగిల్‌(తెలుగులో విజిల్‌) సినిమాలో ఫుట్‌బాలర్‌ పాండియమ్మగా నటించింది. ఇందులో ఆమె నటించిన కామెడీ, సెంటిమెంట్‌ సీన్లకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత ఆమె సర్వైవర్‌ అనే షోలోనూ పాల్గొంది. ప్రస్తుతం ఆమె కార్తీ విరుమాన్‌ సహా పలు సినిమాలతో బిజీగా ఉంది ఇంద్రజ. ఆమె తండ్రి రోబో శంకర్‌ కళక్క పోవదు యారు, అడు ఏడు ఈడు వంటి కామెడీ షోలలో మెరిశాడు. ఇదర్కు తానే ఆశైపట్టై బాలకుమార, వేలైను వందుత వేళ్లైకారన్‌, ఇరుంబు తిరై, విశ్వాసం, అన్నాత్తే చిత్రాలతో వెండితెరపైనా మెరిశాడు.

చదవండి: పంజాబ్‌ను ఓ ఊపు ఊపిన సింగర్‌, ఇప్పటికీ వీడని హత్య మిస్టరీ

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)