Breaking News

రాబిన్‌హుడ్‌లో డేవిడ్‌ వార్నర్‌.. లక్షల్లో కాదు కోట్లల్లో పారితోషికం!

Published on Mon, 03/17/2025 - 12:58

ఆస్ట్రేలియా క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ (David Warner).. మైదానంలో ఎంత ఫేమస్సో, సోషల్‌ మీడియాలోనూ అంతే ఫేమస్‌.. టాలీవుడ్‌ చిత్రాల డైలాగులతో రీల్స్‌ చేస్తూ తెలుగువారి మనసు గెలుచుకున్నాడు. ఈసారి ఏకంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. నితిన్‌ హీరోగా నటించిన రాబిన్‌హుడ్‌ సినిమాలో డేవిడ్‌ వార్నర్‌ కీలక పాత్రలో నటించాడు. ఈ మేరకు ఆయన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ సైతం రిలీజ్‌ చేశారు.

కోట్ల పారితోషికం?
అందులో వార్నర్‌.. షార్ట్‌ హెయిర్‌, కూల్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో వావ్‌ అనిపించాడు. ఇక పోస్టర్‌ రిలీజైనప్పటినుంచి ఈ దిగ్గజ క్రికెటర్‌ రాబిన్‌హుడ్‌ (Robinhood Movie)కు ఎంత పారితోషికం తీసుకుంటున్నాడన్న చర్చ మొదలైంది. సోషల్‌ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. సినిమాలో నటించినందుకుగానూ రూ.3 కోట్లు తీసుకున్నాడట. ప్రమోషన్స్‌లో పాల్గొనేందుకు మరో రూ.1 కోటి అదనంగా అడిగాడట! ఇది విన్న అభిమానులు.. స్టార్‌ క్రికెటర్‌ అంటే ఆమాత్రం ఇచ్చుకోవాల్సిందేనని కామెంట్లు చేస్తున్నారు.

(చదవండి: రైతు అంటేనే ఛీ అనేలా చేసిన వెధవ.. ఈ దొంగ రైతుబిడ్డ: అన్వేష్‌ ఫైర్‌)

అప్పుడలా.. ఇప్పుడిలా.. 
గతంలోనూ వార్నర్‌ పారితోషికం (David Warner Remuneration for Robinhood) గురించి కొన్ని వార్తలు వెలువడ్డాయి. కేవలం సరదా కోసమే ఆయన ఈ పాత్ర ఎంచుకున్నారని, డబ్బు గురించి ఆలోచించలేదని అందులో పేర్కొన్నారు. అయినప్పటికీ నిర్మాతలు రూ.50 లక్షలను అతడికి అందించినట్లుగా ప్రస్తావించారు. ఇప్పుడేమో ఏకంగా రూ.4 కోట్లు తీసుకున్నట్లుగా కథనాలు వస్తున్నాయి. వార్నర్‌ స్పందిస్తే కానీ దీనిపై క్లారిటీ వచ్చేలా లేదు!

సినిమా
రాబిన్‌హుడ్‌ సినిమా విషయానికి వస్తే.. భీష్మ వంటి హిట్‌ మూవీ తర్వాత నితిన్‌, వెంకీ కుడుముల కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రమిది. శ్రీలీల కథానాయికగా నటించింది. రాజేంద్రప్రసాద్‌, వెన్నెల కిశోర్‌ కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మించారు. జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం అందించిన ఈ సినిమా మార్చి 28న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

చదవండి: థియేటర్‌లో సినిమాల జోరు.. ఓటీటీలో ఏకంగా 15 చిత్రాలు/సిరీస్‌లు

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)