Breaking News

అలాంటి హీరోల వల్ల నిర్మాతలు చాలా నష్టపోతున్నారు: ఆర్‌కే సెల్వమణి

Published on Sun, 07/28/2024 - 07:27

తమిళ్‌ సినీ నిర్మాతల మండలి, యాక్టివ్‌ నిర్మాతల మండలి కార్య వర్గాల్లో ఐక్యత లేదని ఫెఫ్సీ అధ్యక్షుడు, దర్శకుడు,నిర్మాత ఆర్‌కే సెల్వమణి పేర్కొన్నారు. నటుడు అశోక్‌ సెల్వన్‌, అవంతిక మిశ్రా జంటగా నటించిన చిత్రం ఎమక్కు తొళిల్‌ రొమాన్స్‌. నటి ఊర్వశి, అళగప్పన్‌ పెరుమాళ్‌, ఎంఎస్‌ భాస్కర్‌, భగవతి పెరుమాళ్‌, భడవా గోపి తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని బాలాజీ కేశవన్‌ దర్శకత్వంలో టి.క్రియేషన్స్‌ పతాకంపై ఎం.తిరుమలై నిర్మించారు. నివాస్‌ కె.ప్రసన్న సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం తాజాగా చైన్నెలోని ప్రసాద్‌ల్యాబ్‌లో నిర్వహించారు. 

కాగా ఈ వేదికపై చిత్ర నిర్మాత ఎం.తిరుమలై, నటుడు అశోక్‌ సెల్వన్‌పై పలు  ఆరోపణలు చేశారు. ఈయన పారితోషికాన్ని పూర్తిగా చెల్లించినా, చిత్రానికి సహకరించలేదని విమర్శించారు. నిర్మాతల డబ్బుతో ఎదిగిన అశోక్‌ సెల్వన్‌ నిర్మాతలను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు ఆరోపించారు. తన చిత్రం ప్రమోషన్‌కు రాకపోవడం ఎంతవరకు సమంజసమో నిర్మాతల సంఘం కార్యవర్గం ఆలోచించాలన్నారు. నిర్మాతలు లేకుంటే నటీనటులు ఎక్కడ అని? నిర్మాత ఎం.తిరుమలై ప్రశ్నించారు. 

కాగా ఈ వేడుకలో పాల్గొన్న ఫెఫ్సీ అధ్యక్షుడు, దర్శకుడు ఆర్‌కే సెల్వమణి మాట్లాడుతూ ఈ చిత్రం విషయంలో నిర్మాత ఎం.తిరుమలైకి, నటుడు ఆశోక్‌ సెల్వన్‌కు మధ్య ఏమి జరిగిందో తనకు తెలియదంటూనే వారి వల్ల చిన్న చిత్రాల నిర్మాతలు మాత్రం చాలా నష్టపోతున్నారన్నారు. చిత్రాలు హిట్‌ అయితే ఎక్కువగా లబ్ధి పొందేది హీరో, హీరోయిన్లేనని, ఆ తరువాత క్యూబ్‌ నిర్వాహకులు, సాంకేతిక వర్గం లాభపడతారని, నిర్మాతకు మాత్రం ప్రయోజనమే ఉండడం లేదన్నారు. ఈ విషయంలో నిర్మాతల మండలి కార్యవర్గంలో ఐక్యత లేదనే చెబుతానన్నారు. అదే ఉంటే ఇలాంటి ఘటనలు తలెత్తవన్నారు. 

నిర్వాహకులందరూ కలిసి నిర్మాతలకు లాభం కలిగేలా ఒక పరిష్కారాన్ని చేయాలన్నారు. అందుకు ఫెప్సీ నుంచి పూర్తి సహకారం ఉంటుందని ఆర్‌కే సెల్వమణి పేర్కొన్నారు. నిర్మాత ఎం.తిరుమలై నిర్మించిన ఎమక్కు తొళిల్‌ రొమాన్స్‌ చిత్రం ట్రైలర్‌, పాటలు చూస్తుంటే వినోదకరమైన ప్రేమ కథా చిత్రంగా ఉంటుందని తెలుస్తోందన్నారు. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నానన్నారు. 

Videos

సారా అర్జున్ సినిమాలు ఎందుకు తగ్గించింది? అసలు కారణం ఇదేనా?

లోకేశ్ బంపర్ ఆఫర్.. రౌడీయిజం చేస్తేనే మంత్రి పదవి లేకపోతే మీ పవర్ కట్..

ఇంట్లో ఉన్న YSRCP MPTC అభ్యర్థిని లాక్కెళ్లిన SI విజయ్

టీడీపీ గూండాలకు పోలీసులు కొమ్ముకాశారు... ఎవరినీ వదిలిపెట్టం

ధర పెరిగిందని పాత బంగారం అమ్మితే లాభమా? నష్టమా? అసలు లెక్క ఇదే

నేనేంటో చూపిస్తా.. బాబుకు దీప్తి రెడ్డి మాస్ వార్నింగ్

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో YSRCP సవాల్

ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్ లైన్ ధ్వంసం.. డ్రైవర్ స్పాట్ డెడ్..!

నామినేషన్లకు వస్తే.. కంకర రాళ్లతో కొడతాం

మెగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్! మెగా కింగ్ కాంబో?

Photos

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)