Breaking News

చాహల్‌తో డేటింగ్ రూమర్స్.. ఇలా దొరికిపోయిందేంటి?

Published on Wed, 04/02/2025 - 17:19

ప్రముఖ యూట్యూబర్, ఆర్జే మహ్‌వశ్‌ పేరు ఇటీవల ఎక్కువగా వినిపిస్తోంది. దుబాయ్‌లో జరిగిన ఛాంపియన్ ట్రోఫీ మ్యాచ్‌ తర్వాత అందరి దృష్టి ఆమెపైనే పడింది. అంతవరకు ముక్కు మొహం తెలియని ఆమె గురించి నెటిజన్స్ తెగ వెతికారు. ఇంతకీ ఆమె ఎవరంటూ ఆరా తీశారు. దీనికంతటికీ కారణం ఆ టీమిండియా క్రికెటరే. అతనితో కలిసి మ్యాచ్‌లో కనిపించడంతో ఒక్కసారిగా ఫేమ్‌లోకి వచ్చేసింది. టీమిండియా స్పిన్నర్ చాహల్‌తో కలిసి ఛాంపియన్‌ ట్రోఫీలో సందడి చేసింది. ఇక అప్పటి నుంచి వరుసగా ఏదో ఒక సందర్భంలో టాక్ వినిపిస్తూనే ఉంది. అంతేకాకుండా వీరిద్దరిపై డేటింగ్ రూమర్స్ కూడా వచ్చిన సంగతి తెలిసిందే.

తాజాగా మరోసారి ఆర్జే మహ్‌వశ్‌ వార్తల్లో నిలిచింది. అయితే ఈ సారి చాహల్‌తో కలిసి మాత్రం కనిపించలేదు.  అతని ఆడుతున్న ఐపీఎల్ మ్యాచ్ కోసం లక్నోలో వాలిపోయింది ముద్దుగుమ్మ. నగరంలో ప్రముఖ హోటల్‌లో ఆర్జే మహ్‌వశ్ ఈత కొడుతున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోను తన ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేసింది.

అయితే చాహల్‌తో డేటింగ్‌ రూమర్స్ వస్తున్న వేళ.. ఐపీఎల్ మ్యాచ్‌ కోసం ఆర్జే మహ్‌వశ్‌ రావడంతో మరోసారి వీరిద్దరిపై రిలేషన్‌పై టాక్ నడుస్తోంది. నిజంగానే ఈ జంట డేటింగ్‌లో ఉన్నారా? అనే చర్చ మొదలైంది. కాగా.. చాహల్ ప్రస్తుతం పంజాబ్ కింగ్స్‌ తరఫున ఐపీఎల్‌ లీగ్‌ ‍ఆడుతున్నారు. ఇటీవలే తన భార్య ధనశ్రీ వర్మతో విడాకులు కూడా తీసుకున్నారు.  మార్చి 20, 2025న ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టులో విడాకులు మంజూరు చేసిన సంగతి తెలిసిందే.

లక్నోలో ఆర్జే మహ్‌వశ్‌ కనిపించడంతో చాహల్‌తో డేటింగ్‌ నిజమేనంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పంజాబ్‌, లక్నో మ్యాచ్‌ జరుగుతున్న సందర్భంలో ఆమె కనిపించడంతో రూమర్స్‌కు మరింత బలం చేకూరుతోంది. మీ రిలేషన్‌షిప్‌ను ఇంకెన్నాళ్లు సీక్రెట్‌గా ఉంచతారని నెటిజన్స్ పోస్టులు పెడుతున్నారు.

ఎవరీ ఆర్‌జే మహ్‌వశ్‌?

ఆర్జే మహ్‌వశ్‌ రేడియో మిర్చిలో రేడియో జాకీ(ఆర్‌జే)గా పని చేస్తోంది. సోషల్‌ మీడియాలో ప్రాంక్‌ వీడియోలు చేస్తూ పాపులర్‌ అయింది. చాహల్‌తో డేటింగ్‌ కథనాలు రావడంతో జనవరిలో 1.5 మిలియన్లు ఉండే ఫాలోవర్ల ఒక్కసారిగా అమాంతం పెరిగింది. అంతేకాకుండా నవాజుద్దీన్‌ సిద్దిఖీ, రెజీనా ప్రధాన పాత్రల్లో నటించిన 'సెక్షన్‌ 108' సినిమాకు నిర్మాతగా వ్యవహరించింది. వీటితో పాటు హీరోయిన్‌గా ఓ వెబ్‌ సిరీస్‌ చేస్తోంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)