Breaking News

బిగ్‌బాస్‌ తర్వాత పని దొరకదు, డిప్రెషన్‌: ఆర్జే కాజల్‌

Published on Sat, 01/31/2026 - 19:30

బిగ్‌బాస్‌ షోలో పార్టిసిపేట్‌ చేసినవాళ్లు ఒక్కసారిగా సెలబ్రిటీలు అయిపోతారు. కానీ ఆ ఫేమ్‌ కొంతకాలమే ఉంటుంది. పైగా దానివల్ల అవకాశాలు వస్తాయా? అంటే అదీ అంతంతమాత్రమే! చాలా తక్కువమందికి మాత్రమే బిగ్‌బాస్‌ కలిసొస్తుంది. విన్నర్స్‌తో సహా అనేకమందికి షో వల్ల ఎటువంటి ఫాయిదా ఉండదు. అదే బల్లగుద్ది చెప్తోంది నటి ఆర్జే కాజల్‌.

బిగ్‌బాస్‌ సెలబ్రిటీస్‌
ఈమె తెలుగు బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌లో పాల్గొంది. బిగ్‌బాస్‌ నిజస్వరూపం ఇదేనంటూ తాజాగా ఓ వీడియో షేర్‌ చేసింది. అందులో కాజల్‌ మాట్లాడుతూ.. బిగ్‌బాస్‌ సెలబ్రిటీస్‌.. జనాలు వాళ్లను సెలబ్రిటీలనే పిలుస్తారు. కానీ, అసలు బిగ్‌బాస్‌ తర్వాత ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. కొంతమందికి వాళ్ల రెగ్యులర్‌ వర్క్స్‌, సినిమాలు, షోస్‌, అవార్డ్స్‌ బానే ఉంటాయి. కానీ చాలామంది విషయంలో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. 

నెక్స్ట్‌ ఏంటి?
ఎక్కడికి వెళ్లినా మీ నెక్స్ట్‌ ప్రాజెక్ట్‌ ఏంటనే అడుగుతారు. దానికి ఇబ్బందిగానే ఏమీ లేదని బదులిస్తారు. బద్ధకం వల్లనో, టాలెంట్‌ లేకనో కాదు అవకాశాలు రాక! బిగ్‌బాస్‌ తర్వాత ఫుల్‌ బిజీ, ఫుల్‌ వర్క్‌ అని అందరూ అనుకుంటారు, కానీ అది మూడు, నాలుగు నెలల వరకు మాత్రమే పరిమితం. దానికి తోడు బిగ్‌బాస్‌ ట్రామా, డిప్రెషన్‌! ఇంతకుముందు చేసుకున్న పని మనస్ఫూర్తిగా చేసుకోలేక, కెరీర్‌లో ఎదుగుదల లేక, ముందుకెళ్లలేక, వెనకడుగు వేయలేక సతమతమవుతూ ఉంటారు. 

జీవితాంతం ఎదురుచూపులు
యాక్టర్స్‌ పరిస్థితి మరీ దారుణం.. ఆ బిగ్‌బాస్‌ సీజన్‌లో నిన్ను చాలామందే చూశారు, కొత్త ముఖాలు కావాలి అంటారు. చాలామంది ప్రధాన పాత్రల కోసం జీవితాంతం ఎదురుచూస్తూనే ఉంటారు. కొంతమంది క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా మారిపోతారు. ఇంకొందరు సోషల్‌ మీడియా, యూట్యూబ్‌తో సరిపెట్టుకుంటారు. రోడ్డుమీదకెళ్తే అందరూ గుర్తుపడతారు, సెల్ఫీలడుగుతారు. 

ఫేమ్‌ వల్ల ఏదీ మారదు
కానీ పని విషయానికి వచ్చేసరికి మాత్రం ఎంతమంది ఫాలోవర్లున్నారు? ఎంత రీచ్‌ ఉంది? అని డబ్బు దగ్గర బేరాలడతారు. బతకడం కోసం కొందరు తక్కువ డబ్బు ఇచ్చినా కాదనలేక చేసుకుంటూ పోతారు. కొంతమంది వేరే కెరీర్‌ ఎంచుకుంటారు. మరికొందరు సైలెంట్‌గా మాయమైపోతారు. బిగ్‌బాస్‌ వల్ల రాత్రికి రాత్రే ఫేమస్‌ అయిపోవచ్చు కానీ ఫేమ్‌ ఒక్కటే కెరీర్‌ను నిర్మించదు. బిగ్‌బాస్‌ వల్ల ఏదీ మారిపోదు. అది కేవలం ఫేమస్‌ రియాలిటీ షో. అంతే! అని చెప్పుకొచ్చింది. 

 

 

చదవండి: ఐశ్వర్యరాయ్‌ తొలి సంపాదన ఎంతో తెలుసా?

Videos

వారసుడొచ్చాడు మెగాస్టార్ ఎమోషనల్...

కుప్పకూలిన దేశీయ స్టాక్ మార్కెట్లు

మేం అధికారంలోకి వస్తే నీ పరిస్థితి ఏంటే ఊహించుకో..

యువతకు కేంద్రం గుడ్ న్యూస్.. లక్షల ఉద్యోగాలు

హైదరాబాద్ పై వరాల జల్లు, 7 హైస్పీడ్ రైళ్లు

పరిపాలన చేతకాక ఈ దాడులు

కళ్ళ ముందే కార్లు, ఫర్నిచర్ ధ్వంసం..! మాకు సంబంధం లేనట్టు పోలీసులు..!

కేంద్ర బడ్జెట్.. పెరిగేవి తగ్గేవి ఇవే..!

24 గంటలు డెడ్ లైన్! పెమ్మసాని వ్యాఖ్యలకు మిథున్ రెడ్డి స్టాంగ్ కౌంటర్

పోలీస్ స్టేషన్ లో ఏం జరుగుతుందో అర్ధం కావడం లేదు అంబటి లాయర్ సంచలన వ్యాఖ్యలు

Photos

+5

సిట్‌ విచారణకు కేసీఆర్‌.. వేల మంది పోలీసుల బందోబస్తు (ఫొటోలు)

+5

అంకెల్లో ఆర్థికం.. చీరల్లో సంప్రదాయం (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఫిబ్రవరి 01-08)

+5

ఒక్కచోట చేరిన బిగ్‌బాస్‌ సెలబ్రిటీలు.. కాకపోతే! (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియా ఓపెన్‌లో సంద‌డి చేసిన సానియా మీర్జా (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో దర్శకుడు అనిల్ రావిపూడి ఫ్యామిలీ (ఫొటోలు)

+5

‘అనగనగా ఒక రాజు’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

‘అనగనగా ఒక రాజు’ మూవీ సక్సెస్ మీట్ లో మెరిసిన మీనాక్షి చౌదరి (ఫొటోలు)

+5

బేబీ బంప్‌తో హీరోయిన్ సోనమ్ కపూర్ (ఫొటోలు)

+5

'కన్నప్ప' ఫేమ్ ప్రీతి ముకుందన్ గ్లామర్ (ఫొటోలు)