Breaking News

యువకుడిపై దాడి.. చిక్కుల్లో కాంతార మూవీ టీమ్..!

Published on Mon, 01/20/2025 - 15:21

కాంతార మూవీతో పాన్ ఇండియా రేంజ్‌లో గుర్తింపు తెచ్చుకున్న హీరో రిషబ్ శెట్టి (Rishab Shetty). 2022లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ మూవీ సూపర్ హిట్ కావడమే కాదు.. దేశవ్యాప్తంగా కళ్లు చెదిరే కలెక్షన్స్‌ రాబట్టింది. దీంతో రిషబ్ శెట్టి ప్రీక్వెల్‌ తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు. కాంతారకు ముందు ఏం జరిగిందనే కథాశంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కర్ణాటకలోని అటవీ ప్రాంతాల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాంతార మూవీ టీమ్ చిక్కుల్లో పడింది. ఈ సినిమా షూటింగ్ వల్ల అటవీ ప్రాంతం నాశనం అవుతోందని స్థానికులు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం కర్ణాటకలోని గవిగుడ్డ అటవీ ప్రాంతంలో కాంతారా చాప్టర్-1 చిత్రీకరణ జరుగుతోంది. దీంతో స్థానికులతో పాటు జిల్లా పంచాయతీ మాజీ సభ్యులు ఆందోళనకు దిగారు. అడవుల్లో పేలుడు పదార్థాల వినియోగిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. దీంతో గవిగుడ్డ, హేరురు గ్రామాల్లోని అటవీ ప్రాంతంలో రహస్యంగా చిత్రీకరణ చేయడంపై స్థానికులు ఆరోపిస్తున్నారు. దీని వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  కేవలం గడ్డి మైదానంలో చిత్రీకరణకు అనుమతి తీసుకుని.. అటవీ ప్రాంతాల్లో షూటింగ్ నిర్వహిస్తున్నట్లు ఆరోపణలొస్తున్నాయి.

స్థానిక నేతల సీరియస్

సినిమా చిత్రీకరణ వల్ల జంతువులు, పక్షులకు హాని కలుగుతోందని జిల్లా పంచాయతీ మాజీ సభ్యుడు సన్న స్వామి ఆరోపించారు. ఇప్పటికే అడవి ఏనుగుల దాడితో రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అడవులను రక్షించాలని సుప్రీంకోర్టు ఆదేశించినా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మరింత నష్టం జరగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన హెచ్చరించారు.

చిత్రబృందంతో వాగ్వాదం..

అడవుల్లో పేలుడు పదార్ధాల వినియోగంపై స్థానికులు చిత్ర బృందం సిబ్బందితో వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ గొడవలో స్థానికుడైన హరీష్ అనే యువకుడిపై సిబ్బంది దాడి చేయగా గాయాలైనట్లు సమాచారం. అతన్ని వెంటనే సమీపంలోని సకలేష్‌పూర్‌లోని క్రాఫోర్డ్ ఆసుపత్రిలో చేర్పించారు.

ఈ ఘటనపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కాంతార మూవీ చిత్రీకరణను వేరే ప్రదేశానికి మార్చాలని.. సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే స్థానికంగా యెసలూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

కాగా.. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో కాంతారా: చాప్టర్ 1 తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని కేజీఎఫ్ మేకర్స్, హోంబలే ఫిల్మ్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ఈ ఏడాది గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ఈ మూవీ థియేటర్లలో విడుదల కానుంది. కాగా.. 2022లో వచ్చిన కాంతార అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాకు రిషబ్ శెట్టి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును గెలుచుకున్నాడు.
 

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)