Breaking News

కాంతార చూడాలంటే మందు, ముక్క జోలికి వెళ్లకూడదంటూ పోస్ట్‌!

Published on Wed, 09/24/2025 - 13:00

ఈ ఏడాది సినీజనం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో కాంతార ప్రీక్వెల్‌ ఒకటి. 2022లో వచ్చిన కాంతార మూవీ సంచలన విజయాన్ని అందుకుంది. దీనికి ప్రీక్వెల్‌గా వస్తోంది కాంతార: చాప్టర్‌ 1 (Kantara: Chapter 1 Movie). రిషబ్‌ శెట్టి దర్శకత్వం వహించి ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ అ‍క్టోబర్‌ 2న విడుదల కానుంది. ఇటీవల ట్రైలర్‌ రిలీజ్‌ చేయగా అద్భుతమైన స్పందన వస్తోంది.

కాంతార చూడాలంటే..
అయితే కాంతార చూడాలంటే కొన్ని నియమాలు పాటించాలంటూ ఓ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. మద్యం సేవించకూడదు, సిగరెట్‌ తాగకూడదు, మాంసం తినకూడదు. కాంతార చూసేవరకు వీటిని కచ్చితంగా ఫాలో అవండి అన్నది ఆ పోస్ట్‌ సారాంశం. అయితే అది ఫేక్‌ ప్రచారమని కొట్టిపాడేశాడు రిషబ్‌ శెట్టి (Rishab Shetty). బెంగళూరులో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఒకరి అలవాట్లను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు. ఎవరిష్టం వారిది. 

డిలీట్‌ చేశారు
కొందరు ఫేక్‌ పోస్ట్‌ సృష్టించిన విషయం మా దృష్టికి వచ్చింది. అది చూడగానే నేను షాకయ్యాను. వెంటనే దాన్ని నిర్మాతల గ్రూప్‌కు పంపించాను. ఆ పోస్ట్‌ చూశాక వెంటనే స్పందించలేకపోయాం. సినిమా పేరు ట్రెండింగ్‌లో ఉండటంతో పాపులారిటీ కోసం, వ్యూస్‌ కోసం ఇలాంటి పనులు చేస్తుంటారు. ఆ ఫేక్‌ పోస్ట్‌ చేసినవారు దాన్ని డిలీట్‌ చేసి క్షమాపణలు చెప్పారు అని రిషబ్‌ శెట్టి తెలిపాడు.

చదవండి: బిగ్‌బాస్‌కు వద్దన్నాం.. మీరే ఓట్లేశారు.. మరిప్పుడెందుకు ట్రోలింగ్‌?

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)