Breaking News

కాంతార చాప్టర్-1.. 90 శాతం అక్కడే పూర్తి చేశాం: రిషబ్ శెట్టి

Published on Tue, 10/07/2025 - 16:01

రిషబ్ శెట్టి స్వీయ డైరెక్షన్లో వచ్చిన తాజా చిత్రం కాంతార చాప్టర్-1. భారీ బడ్జెట్తో నిర్మించిన సినిమా దసరా కానుకగా థియేటర్లలో సందడి చేసింది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. సూపర్ హిట్ మూవీ కాంతారకు ప్రీక్వెల్గా వచ్చిన సినిమా అదిరిపోయే కలెక్షన్స్ రాబడుతోంది. కర్ణాటకలోని ప్రాచీన కళ భూతకోల ఆధారంగా సినిమాలను తెరకెక్కించారు.

తాజాగా సినిమాకు సంబంధించిన ఆసక్తకర విషయం బయటకొచ్చింది. మూవీ షూటింగ్రిషబ్ శెట్టి తన సొంత గ్రామంలోనే తెరకెక్కించినట్లు వెల్లడించారు. అంతేకాకుండా దాదాపు 90 శాతం ఎడిటింగ్ తన ఊర్లోనే పూర్తి చేశామని రిషబ్ శెట్టి తెలిపారు. తాజాగా ఇంటర్వ్యూకు హాజరైన రిషబ్ విషయాన్ని పంచుకున్నారు. కాగా.. కర్ణాటకలోని ప్రత్యేక ప్రాంతానికి సంబంధించిన సంస్కృతి, జానపద కథ నిర్మాణం కోసం రిషబ్ శెట్టి తన స్వగ్రామంలోనే ఎక్కువగా ఈ మూవీని చిత్రీకరించినట్లు తెలుస్తోంది.

రిషబ్ శెట్టి మాట్లాడుతూ..' సినిమా దాదాపు 90 శాతం పోస్ట్, ప్రొడక్షన్ పనులన్నీ మా సొంత గ్రామంలోనే జరిగాయి. మేము కేవలం మిగిలిన పదిశాతం పనికోసమే బెంగళూరు, కొచ్చికి వచ్చాం. ఈ సినిమా కోసం ఏకంగా సంగీత దర్శకుడిని కూడా గ్రామానికి తీసుకువచ్చి అక్కడే మొత్తం రికార్డింగ్‌ పూర్తి చేశాం. సినిమా ఎడిటింగ్‌లో దాదాపు 90 శాతం మా గ్రామంలోనే జరిగింది. మా గ్రామంలోని ప్రజలు పెద్దఎత్తున షూటింగ్ వద్దకు రావడంతో ఒకరకంగా ఫిల్మ్ టౌన్గా మారిపోయింది. ప్రతి రోజు కనీసం 100 వాహనాలు షూటింగ్కు వచ్చేవి. దాదాపు ప్రతి రోజు వెయ్యిమందిని సెట్లో ఉంచాం. కాంతార కోసమే నేను, నా భార్య, పిల్లలతో కలిసి నా స్వగ్రామానికి వెళ్లా' అని అన్నారు.

కాగా.. కాంతార: చాప్టర్ 1 కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. సినిమాలో రుక్మిణి వసంత్, జయరామ్, గుల్షన్ దేవయ్య కీలక పాత్రల్లో నటించారు.

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)