Breaking News

కాంతార చాప్టర్-1 షూట్.. ఆ సీన్స్ కోసం ఏకంగా!

Published on Sun, 11/02/2025 - 13:27

కన్నడ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన లేటేస్ట్ మూవీ కాంతార చాప్టర్-1. గతంలో సూపర్‌ హిట్‌గా నిలిచిన కాంతారకు ప్రీక్వెల్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ ఏడాది దసరా కానుకగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అక్టోబర్‌ 2న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ ఏడాది ‍అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో సందడి చేస్తోంది.

ఈ మూవీ సూపర్ హిట్‌ కావడంతో కాంతార టీమ్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఈ సందర్భంగా రిషబ్ శెట్టి మూవీ షూటింగ్ సహకరించిన అన్నదమ్ములకు శుభాకాంక్షలు తెలిపారు. కుందాపురకు చెందిన ఉవా మెరిడియన్ ఫిల్మ్ స్టూడియో యాజమానులు ఉదయ్ కుమార్ శెట్టి, వినయ్ కుమార్ శెట్టి తమ సినిమా కాంతార చాప్టర్‌-1 ఎంతో సహకరించారని అన్నారు.  కాంతారా చాప్టర్ 1 షూటింగ్ కోసం 22 వేల చదరపు అడుగుల ఏసీ సెట్‌ను రూపొందించారని వెల్లడించారు. ఇందులోనే ఇండోర్ సీక్వెన్స్‌ తెరకెక్కించామని ట్విటర్‌లో పోస్ట్ చేశారు. తన మూవీకి మద్దతుగా నిలిచిన మీకు ఎల్లప్పుడూ కృతజ్ఞులుగా ఉంటామని రాసుకొచ్చారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కాంతార చాప్టర్-1 మూవీని హోంబలే ఫిల్మ్స్‌ బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. రిషబ్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ సినిమా ఛావాను అధగమించింది.  అంతేకాకుండా కన్నడ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో మూవీగా ఘనత సాధించింది. ఈ మూవీలో రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య, జయరామ్ కీలక పాత్రలు పోషించారు. 
 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)